BigTV English

Nani : పెద్ది, పారడైజ్ సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడంపై నాని రియాక్షన్

Nani : పెద్ది, పారడైజ్ సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడంపై నాని రియాక్షన్

Nani : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న దర్శకులు అందరికంటే కూడా సుకుమార్ శైలి విభిన్నమని చెప్పాలి. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ దర్శకుడు చేయని ఒక అచీవ్మెంట్ సుకుమార్ సాధించారు. సుకుమార్ దగ్గర పని చేసిన చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్ స్ డైరెక్టర్స్ గా మారిపోయారు. సుకుమార్ దగ్గర రంగస్థలం సినిమాకి శ్రీకాంత్ ఓదెల పనిచేశారు. ఆ సినిమాకి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ శ్రీకాంత్ చూసుకున్నారు. ఇక బుచ్చిబాబు ఆర్య సినిమా తర్వాత నుంచి సుకుమార్ దగ్గర చేస్తూ ఉన్నారు.


దసరా సినిమాతో మార్క్

శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను నిర్మించిన సంస్థకు అప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్ సినిమా లేదు. కానీ ఒక డెబ్యూ డైరెక్టర్ వచ్చి నాని కెరియర్లో హైయెస్ట్ మార్కెట్ సినిమాను చేశాడు. మొదటి సినిమాతోనే తన మార్క్ చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక ప్రస్తుతం నానితోనే ప్యారడైజ్ అనే ఒక సినిమాను చేస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో కూడా మంచి అంచనాలను రేపింది. 2026 మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.


బుచ్చిబాబు పెద్ది

ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు. మొదటి సినిమాతోనే 100 కోట్లు మార్కెట్ టచ్ చేసి సుకుమార్ శిష్యుడు అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా పెద్ది అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మార్చి 27 2026న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షాట్ కూడా రిలీజ్ అయిపోతుంది. మార్చ్ 27 కి ఎంతటి ప్రత్యేకత ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆరోజు రామ్ చరణ్ పుట్టినరోజు. అయితే ఇద్దరి సుకుమార్ శిష్యులు సినిమాలు ఒకే టైంలో రావడం పై నాని రియాక్ట్ అయ్యారు.

నాని రియాక్షన్

పెద్ది, పారడైజ్ సినిమాలు ఒకేసారి వస్తుండడంతో నాని రియాక్ట్ అయ్యారు. చెప్పిన డేట్ కు ప్యారడైజ్ సినిమా వచ్చేటట్లు శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక పెద్ది సినిమా కూడా ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా రిలీజ్ కి చాలా టైం ఉంది కాబట్టి ఆలోచిద్దాం. ఒకవేళ చెప్పిన డేట్ ప్రకారం రెండు సినిమాలు ఒకేసారి వస్తే రెండు బ్లాక్ బస్టర్ అవుతాయి అని నాని రియాక్ట్ అయ్యారు.

Also Read : Gnapika entertainments : అపోహలన్నీ పక్కన పెట్టే ప్రవస్తి, మళ్లీ కం బ్యాక్ ఇవ్వు

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×