Padutha Theeyaga Allegations : గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా పాడుతా తీయగా ప్రోగ్రాం కంటెస్టెంట్ ప్రవస్తి చేసిన ఆరోపణలు వైరల్ గా మారాయి. ఎంతో గౌరవప్రదమైన షో గా పేరు సాధించిన పాడుతా తీయగా ప్రోగ్రాం గురించి, అలానే ఆ ప్రోగ్రాం వెనకాల జరిగే కొన్ని విషయాలు గురించి సింగర్ ప్రవస్తి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో పేరు సాధించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, సింగర్ సునీత, సాహిత్య రచయిత చంద్రబోస్ పైన కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు ప్రవస్తి. ఇదివరకే ప్రవస్థి చాలా రియాల్టీ షోస్ లో పాల్గొన్నారు. అయితే మిగతా షోస్ కి, పాడుతా తీయగా షో కి చాలా డిఫరెన్స్ ఉంది, జడ్జిస్ ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉంటారు. నన్ను టార్గెట్ చేశారు అని వాళ్ల గురించి మాత్రమే మాట్లాడకుండా, ఆ షో కి ప్రొడక్షన్ చేస్తున్న జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ గురించి కూడా మాట్లాడారు. పొట్టి పొట్టి బట్టలు వేసుకోమంటున్నారు అంటూ కాస్ట్యూమ్స్ పైన కూడా వ్యాఖ్యలు చేశారు.
జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ రియాక్షన్
ప్రవస్థి చేసిన ఈ మాటలపై జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ Md ప్రవీణ రియాక్ట్ అయ్యారు. ఈవిడ ప్రవస్తి చేసిన ప్రతి మాటలకు సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ గురించి కంప్లైంట్ చేశావు ఆ కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసేది నేనే. నేను సెలెక్ట్ చేసిన తర్వాత ఈటీవీ వాళ్లకు పంపిస్తే వాళ్లు ఓకే చేసిన తర్వాత నేను డిజైనర్ కి చెప్పి కాస్ట్యూమ్స్ చేపిస్తాను అంటూ చెప్పుకోచ్చారు.
ఒకవేళ నీకు నిజంగా కాస్ట్యూమ్స్ ప్రాబ్లం ఉంటే, అలానే నీకు బాడీ సేమింగ్ చేసి ఉంటే అక్కడే ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ కి, డైరెక్టర్ కి, లేదా నాకు చెప్పే అవకాశం ఉంది. కానీ ఎలిమినేట్ అయిన తర్వాత బయటకు వచ్చి మీరు ఆరోపణలు చేస్తున్నారు. బాలు గారు తో కూడా మేము చాలా ఎపిసోడ్స్ చేశాము. అప్పుడు కూడా డైరెక్టర్ అనిల్ గారు ఉన్నారు. బాలు గారు అనిల్ ని చాలా మెచ్చుకున్నారు.
అలానే జడ్జెస్ గురించి కూడా మాట్లాడావు. అసలు జడ్జిమెంట్ అంటే ఏంటి, ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత మనం ఏ కారణాలు చెప్పిన అవి జరగవు. అగ్రిమెంట్లో కూడా జడ్జిమెంట్ కి యాక్సెప్ట్ చేస్తాను అని ఉంటుంది.
అంటూ ఈ ఎపిసోడ్స్ లో ప్రవస్తి వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా ఆ వీడియోలో చూపించారు. అంతా మాట్లాడిన తర్వాత ఈ అపోహలన్నీ పక్కనపెట్టి ప్రవస్తి నువ్వు స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటూ ప్రవీణ తెలిపారు.
సునీత రియాక్షన్
ఇక కొద్దిసేపటి క్రితమే సునీత కూడా ఈ ఆరోపణలు గురించి రియాక్ట్ అయ్యారు. చిన్నప్పుడు బాలు గారు, జానకమ్మ, నేను నిన్ను ఎత్తుకున్నాము ఇప్పుడు 19 ఏళ్ల వయసులో ఎత్తుకోవడం కరెక్ట్ కాదు. అప్పుడు నువ్వు బాగా పాడావు అని చెప్పడం కంటే ముద్దుగా పాడావు అని చెప్పడం మంచిది. నువ్వు ఆ కంటిస్టెన్సీ మెయింటెన్ చేయలేదు అంటూ ఆవిడపై చేసిన ప్రతి ఆరోపణకి తనదైన సమాధానం సింగర్ సునీత చెప్పుకొచ్చారు.