BigTV English

Kohli-PSL : PSL టోర్నమెంట్ లో కోహ్లీ ఫ్యాన్స్…. పాకిస్థాన్ వాళ్లకు ఇదేం పిచ్చిరా

Kohli-PSL : PSL టోర్నమెంట్ లో కోహ్లీ ఫ్యాన్స్…. పాకిస్థాన్ వాళ్లకు ఇదేం పిచ్చిరా

Kohli-PSL : భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ గురించి నిత్యం చెడుగా మాట్లాడే పాకిస్తాన్ లాంటి దేశంలో కూడా విరాట్ కోహ్లీకి ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఇండియా లో జరుగుతున్నటువంటి ఐపీఎల్ మాదిరిగానే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో భాగంగా అక్కడ జరిగినటువంటి ఓ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ క్రేజ్ కనిపించింది.


ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అభిమాని కూడా కనిపించాడు. ఆ అభిమాని ధరించినటువంటి జెర్సీ పై విరాట్ కోహ్లీ అనే పేరు రాసి ఉంది. ఈ అభిమాని ఫొటో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అభిమాని కనిపించడం ఇది మొదటి సారి ఏం కాదు. ఇటీవలే ఇస్లామాబాద్ యునైటేడ్, పెషావర్ జల్మీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ ఐకానిక్ నెంబర్ 18 రాసి ఉన్న జెర్సీ ధరించాడు ఓ అభిమాని. అలాగే ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు కూడా కరాచీ స్టేడియం బయట ఉన్న ఓ అభిమాని పొటో వైరల్ అయింది. అందులో ఆ వ్యక్తి విరాట్ కోహ్లీ పేరు, జెర్సీ నెంబర్ 18 ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీని ధరించి కనిపించడం విశేషం.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆర్సీబీ తరపున ఆడుతున్నారు. ప్రతీ సీజన్ మాదిరిగానే ఈ సీజన్ లో కూడా విరాట్ కోహ్లీ తన బ్యాట్ తో నిప్పులు చెరుగుతున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆర్సీబీ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడగా.. 5 మ్యాచ్ లలో విజయాలను సాధించింది. 3 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మొన్న ముల్లాన్ పూర్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ  బౌలర్లు, బ్యాటర్లు రాణించడంతో సొంతగడ్డ పై పోగొట్టుకున్న ఫలితాన్ని పంజాబ్ కి వెళ్లి రాబట్టుకుంది. ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ పై బెంగళూరు ఘన విజయం సాధించింది.


ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 54 బంతుల్లో 73 నాటౌట్ గా నిలిచారు. లక్ష్యం పెద్దది కాకపోయినా ఓపెనర్ సాల్ట్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకున్నాడు. కోహ్లీ, పడిక్కల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మిగిలిన కథ నడిపించారు. వన్ డౌన్ బ్యాటర్ పడిక్కల్ భారీ సిక్సర్లతో విరుచుకుపడగా.. ఇద్దరూ రెండో వికెట్ కి 103 పరుగులు జోడించారు. పడిక్కల్ ఔట్ అయినప్పటికీ చివరి వరకు కోహ్లీ ఉండి విజయంలో కీలక పాత్ర పోషించారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×