The Paradise: న్యాచురల్ స్టార్ నాని.. ఆర్జేగా కెరీర్ మొదలుపెట్టి.. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి వచ్చి.. హీరోగా మారి.. ఇప్పుడు న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో నాని ఒకడు. మంచి కథలను ఎంచుకుంటూ .. ప్రేక్షకులను తన నటనతో ఫిదా చేస్తూ మరింత మెప్పిస్తున్నాడు. నేడు నాని 41 వ పుట్టినరోజు. ఉదయం నుంచి ఆయనకు అభిమానులతో పాటు స్టార్స్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాకుండా నాని నటించిన సినిమా నుంచి వరుస అప్డేట్స్ ను అందిస్తూ మేకర్స్.. తమ హీరోకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఏడాదికొక హిట్ అందుకుంటున్న నాని.. ఈ ఏడాది రెండు సినిమాలను ప్రకటించాడు. ఒకటి హిట్ 3 అయితే.. రెండోది ది ప్యారడైజ్. ఇప్పటికే హిట్ 3 నుంచి టీజర్ ను రిలీజ్ చేసి నానికి బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక తాజాగా ది ప్యారడైజ్ నుంచి కూడా మంచి అప్డేట్ ను తెలిపారు మేకర్స్. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో దసరా టాప్ 5 లో ఉంటుంది. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడుతో నాని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.
ఇక దసరా తరువాత నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న చిత్రమే ది ప్యారడైజ్. సుధాకర్ చెరుకూరి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా టీజర్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మార్చి 3 న ది ప్యారడైజ్ టీజర్ వస్తుందని.. నాని రా స్టేట్మెంట్ ఇచ్చేశాడు.
Hebba Patel : శారీలో క్యూట్ అందాలతో అబ్బా అనిపిస్తున్న హెబ్బా.. కుర్రకారుకు ఫిదా…
ది ప్యారడైజ్ పోస్టర్ లో గమనిస్తే.. ఎరుపు రంగులో పూర్తిగా హింసతో కూడిన తిరుగుబాటులా కనిపిస్తుంది. ఈ సినిమాలో నాని.. ప్రజల కోసం పోరాడే లీడర్ గా.. వారికోసం ఏదైనా చేసే నాయకుడిగా కనిపించనున్నాడని సమాచారం. దసరా కాంబో అనగానే అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక లీడర్ గా నాని కనిపిస్తున్నాడు అంటే ఆ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
గ్యాంగ్ లీడర్ సినిమాకు కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. ఇక ఇప్పుడు మరోసారి నాని – అనిరుధ్ కాంబో రిపీట్ అవుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో దసరా కాంబో మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.