Nandamuri Balakrishna:నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొట్టినా బాలయ్యే.. పెట్టినా బాలయ్యే అని కొంతమంది అంటారు. ఆయన వయస్సు పెరుగుతుందేమో కానీ ఆయన మనసు చిన్న పిల్లల దగ్గరే ఆగిపోయిందని ఇంకొందరు అంటారు. ఇక ఫ్యాన్స్ ఎలా అనుకున్నారు అనేది పక్కన పెడితే.. బాలయ్య చెల్లెలు భువనేశ్వరి కూడా అన్న గురించి ఎంతో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు భార్యగా భువనేశ్వరి అందరికీ తెల్సిందే. నారా – నందమూరి కుటుంబాల మధ్య బంధం, అనుబంధం ఏ రేంజ్ లో ఉంటుందో కనిపిస్తూనే ఉంటుంది. బాలయ్య కూతురు బ్రాహ్మణిని.. భువనేశ్వరి తన కొడుకు లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేసింది. సొంతగా మేనకోడలు.. నారావారి కుటుంబంలో కూతురుగా మారి ఒకపక్క ప్రేమానురాగాలు కురిపిస్తూనే ఇంకోపక్క బాధ్యతలను కూడా చేపడుతుంది. బాలయ్య ఎప్పుడు చూసిన చంద్రబాబుతోనో.. లోకేష్ తోనో కనిపిస్తాడు తప్ప భువనేశ్వరితో కనిపించడం చాలా అరుదు.
Pushpa 2: కుర్రాళ్లను కిర్రెక్కించే కిస్సిక్ వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్..
ఈ ఏడాది చంద్రబాబు పదవి స్వీకరణ సమయంలో బాలయ్య.. చెల్లెలు భువనేశ్వరిని ఆశీర్వదించి తలపై ముద్దుపెట్టిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. అన్నాచెల్లెల అనుబంధం అని చెప్పుకొచ్చారు. ఇక ఇదంతా పక్కన పెడితే.. భువనేశ్వరి తాజాగా ఒక స్కూల్ ఈవెంట్ లో బాలయ్య గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంత నందమూరి కుటుంబంలో నుంచి వచ్చినా భువనేశ్వరి సినిమాలు చూడదు. ఆ విషయాన్నీ ఆమె నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు.
“నందమూరి కుటుంబంలో పెరిగినా సినిమాలు చాలా తక్కువ చూస్తాను. డైరెక్టర్స్ గురించి నాకు అసలు ఐడియా కూడా లేదు. కలిసినప్పుడు మాత్రం అందరూ బావున్నారా.. ? అని అడుగుతాను అంతే. బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే .. చాలామంది ఆయన నా తమ్ముడు అనుకుంటారు. నేను చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతాను. ఆయన నా తమ్ముడు కాదు. నాకు అన్న. రెండేళ్లు నాకన్నా పెద్ద.
అందరూ వచ్చి మీ తమ్ముడు ఎలా ఉన్నారు అని అడుగుతారు.. అది నాకసలు ఇష్టం ఉండదు. లేదండీ ఆయన నా అన్న, తమ్ముడు కాదు అని గుర్తుచేస్తూ ఉంటాను. ఆయన సినిమాలు నాకు నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి, అఖండ సినిమాలు ఇష్టం. డైలాగ్స్ చెప్పలేను. కావాలంటే స్కూల్ కు వచ్చి మీ అందరికీ లెసన్స్ చెప్పమంటే చెప్తాను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
అరెరే బాలయ్య వయస్సు గురించి బయటపెట్టేశారే అని ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన డాకు మహారాజ్ సంక్రాంతికి రిలీజ్ కానుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.