BigTV English

Pushpa 2: కుర్రాళ్లను కిర్రెక్కించే కిస్సిక్ వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్..

Pushpa 2: కుర్రాళ్లను కిర్రెక్కించే కిస్సిక్ వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్..

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రం పుష్ప 2. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్  4 న ప్రేక్షకుల ముందుకు వచ్చి  భారీ విజయాన్ని అందుకుంది. మొదట  మిక్స్డ్ టాక్ అందుకున్నా.. ఉన్నాకొద్దీ వేగం పుంజుకొని రికార్డ్ కలక్షన్స్  రాబట్టి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర రంగంలోనే ఏ సినిమా సాధించని కలక్షన్స్ ను పుష్ప 2 సాధించి రికార్డులు సృష్టించింది.


పుష్ప 2 రిలీజ్ అయ్యి.. 15 రోజులు అవుతున్నా ఇంకా కలక్షన్స్ మాత్రం తగ్గలేదు. అది పుష్పగాడి రేంజ్.  15 రోజుల్లో ఈ  సినిమా.. రూ. 1409 కోట్లు సాధించింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా పుష్ప తన సత్తా చాటాడు. అక్కడ 15 రోజులకు రూ. 618 కోట్లు వసూళ్లు అందుకొని బాలీవుడ్ లో తెలుగోడి సత్తా చూపించాడు. గత కొన్నిరోజులుగా  పుష్ప 2  నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్దమయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజమో తెలియదు కానీ, మేకర్స్ మాత్రం.. ఓటీటీ ప్రమోషన్స్  కూడా మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 లోని వీడియో సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

Manchu Manoj: ట్రెండింగ్ లోకి మరో కొత్త తిట్టు.. మనోజ్ పోస్ట్ వైరల్..!


రోజుకో వీడియో సాంగ్ రిలీజ్ చేస్తూ ఇంకా హైప్ ఎక్కిస్తున్నారు. మొన్నటికి మొన్న పీలింగ్స్ సాంగ్ రిలీజ్ అవ్వగా.. నిన్న పుష్ప టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా నేడు సోషల్ మీడియాను మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన కిస్సిక్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.  ఈ కిస్సిక్ సాంగ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి. పుష్పలో  సమంత ఐటెంసాంగ్ చేసింది. ఆమె అందానికి, డ్యాన్స్ కు  మ్యాచ్ అయ్యే హీరోయిన్ తోనే పుష్ప  2 లో ఐటెంసాంగ్ చేయించాలని సుకుమార్ మంకు పట్టు పట్టుకొని కూర్చున్నాడు.

ఎంతోమంది బాలీవుడ్ హాట్ బ్యూటీస్ ను దింపాలని ప్రయత్నించాడు. కానీ, చివరకు టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రీలీలను దింపాడు. దెబ్బలు పడతాయిరో అంటూ శ్రీలీల కసిగా చూస్తుంటే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. శ్రీలీల, బన్నీ డ్యాన్స్  కి థియేటర్స్ బద్దలు అయ్యాయి. సామ్ అంత కాకపోయినా శ్రీలీల  కూడా హాట్ గానే కనిపించిందని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. చంద్రబోస్ లిరిక్స్ ఒక ఎత్తు అయితే దేవిశ్రీ ప్రసాద్  మ్యూజిక్ మరో ఎత్తు.  పుష్ప 2 కి కిస్సిక్ సాంగ్ హైలెట్ అయ్యిందనే చెప్పొచ్చు.

Koratala Shiva: రౌడీ హీరోతో సినిమా.. ఫిక్స్ అయితే మాస్ హిట్ గ్యారెంటీ..!

ఇక ఈ సినిమా హిట్ తరువాత శ్రీలీల.. కిస్సిక్ భామగా మారిపోయింది. ఒకప్పుడు హీరోయిన్ గా చేస్తూ ఐటెం సాంగ్స్ చేయాలంటే  చాలామంది భయపడేవారు. ఆ సాంగ్ తరువాత హీరోయిన్ గా అవకాశాలు రావేమో.. ఐటెంసాంగ్స్  కు మాత్రమే పరిమితమవుతానేమో అని భయం ఉంటుంది. కానీ, ఈ జనరేషన్ హీరోయిన్స్ కు ఆ భయం లేదు. ఇంకా ఐటెం సాంగ్ చేయడం వలన తమ డ్యాన్స్ ను ప్రేక్షకులకు చూపించే అవకాశం ఉంటుందని చెప్పుకొస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం థియేటర్ లో కిస్సిక్ భామ  కిర్రాక్ డ్యాన్స్ చూడడం మిస్ అయితే.. యూట్యూబ్ లో చూసేయండి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×