Brahmani:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నారు నటసింహ బాలకృష్ణ (Balakrishna) ఒకవైపు హీరో గానే కాకుండా మరొకవైపు రాజకీయ నాయకుడిగా కూడా చలామణి అవుతున్నారు అంతటితో ఆగిపోకుండా వేగ జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేస్తున్న బాలయ్య.. ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె కార్యక్రమానికి హోస్ట్గా కూడా పనిచేస్తూ.. సక్సెస్ అయ్యారు. ఇలా మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్నారు బాలయ్య. ఇకపోతే బాలయ్య మాత్రమే కాదు బాలయ్య కూతుర్లు కూడా అంతే తెలివైన వారు. ఎవరికి వారు తమ రంగంలో సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
స్టార్ డైరెక్టర్ నుండి నారా బ్రాహ్మణికి హీరోయిన్గా అవకాశం..
ఇకపోతే పెద్ద కూతురు నారా బ్రాహ్మణి (Nara Brahmani) గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చూడడానికి హీరోయిన్ మెటీరియల్.. కానీ ఇండస్ట్రీలోకి మాత్రం రాలేదు. దీంతో బాలయ్య ఎందుకు తన కూతుర్ని హీరోయిన్ చేయలేదు అని చాలామంది పలు రకాల ప్రశ్నలు కూడా గుప్పించారు. ఈ క్రమంలోనే ఒక స్టార్ డైరెక్టర్ కూడా బ్రాహ్మణికి హీరోయిన్గా అవకాశం కల్పించారట. మరి ఎందుకు నటించలేదు? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అసలు విషయంలోకి వెళితే.. నారా బ్రాహ్మణి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ భార్యగా ఒకవైపు బాధ్యతలు చేపడుతూనే, మరొకవైపు బిజినెస్ రంగంలో కూడా మంచి స్టేటస్ ను అందుకుంది. ఇక ఈమెకు కూడా సినిమా అవకాశాలు వచ్చాయి అని, అన్ స్టాపబుల్ షో వేదికగా బాలయ్య స్వయంగా వెల్లడించారు.
అసలు విషయంపై బాలకృష్ణ క్లారిటీ..
అసలు విషయంలోకి వెళితే.. అన్ స్టాపబుల్ సీజన్ 4 ఎపిసోడ్ 8 లో.. బాలయ్య హీరోగా నటిస్తున్న ‘డాకు మహారాజ్’ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ వచ్చి సందడి చేసింది. అందులో భాగంగానే దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత నాగ వంశీ గెస్ట్లుగా పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు ? అని తమన్ అడగగా.. బాలకృష్ణ స్పందించారు. ఇద్దర్నీ అంతే గారాబంగానే పెంచాను అని చెబుతూనే.. పెద్దమ్మాయి సినిమా కెరియర్ గురించి కూడా మాట్లాడారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. “మణిరత్నం (Maniratnam) అప్పట్లో ఒక సినిమా కోసం హీరోయిన్ గా బ్రాహ్మణిని అడిగారు. నేను ఈ విషయాన్ని ఆమెకి చెబితే “మై ఫేస్” అంటూ సమాధానం చెప్పింది. నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని నేనంటే, చివరికి తాను ఆసక్తి లేదని చెప్పేసింది. అయితే చిన్నమ్మాయి తేజస్విని (Tejaswini) మాత్రం ఎప్పుడూ అద్దంలో చూసుకుంటూ ఆక్ట్ చేసేది. కనీసం తనైనా నటి అవుతుందని అనుకున్నాను. ఆమె చాలా యాక్టివ్ గా కూడా ఉంటుంది. ఈ షో కి ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్ కూడా.అయితే వారు మాత్రం ఎవరికి వారు తమ రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ల తండ్రిని నేను అని చెప్పుకునే స్థాయికి వారు ఎదిగారంటే ఇంతకుమించి నాకేం కావాలి. ఇప్పటికీ నేను నా పెద్ద కూతురు బ్రాహ్మణికి భయపడతాను” అంటూ అసలు విషయాన్ని తెలిపారు బాలయ్య.. ఇక ప్రస్తుతం నారా బ్రాహ్మణికి ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేకే ఆమె నటన రంగంలోకి అడుగు పెట్టలేదని సమాచారం