Manchu Manoj: టాలీవుడ్ హీరోస్ మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్నచిత్రం భైరవం. యంగ్ డైరెక్టర్ విజయ కనకమెడల్ దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధా మోహన్ ఈ సినిమాని నిర్మించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో మంచు మనోజ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.. తాజాగా మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా నారా రోహిత్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివారాలలోకి వెళితే ..
మంచు మనోజ్ కి బర్త్‌డే విషెస్..
మంచు వారింట్లో పంచాయతీ అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన ఈవెంట్లో మంచు మనోజ్ ఎమోషనల్ అవ్వడం పక్కనే ఉన్న నారా రోహిత్, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓదార్చడం. దర్శకుడు విజయ్ కనకమెడల మంచు మనోజ్ కి సపోర్టుగా అదే ఈవెంట్ లో మాట్లాడటం చూసాము. ఇక ఇప్పుడు తాజాగా మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా నారా రోహిత్ ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. ఈ పోస్ట్ లో బాబాయ్ నీ ఫ్యాన్స్ నిన్ను ఎందుకు ఇష్టపడతారో.. ఎప్పుడైనా ఆలోచించావా.. ఎందుకంటే నువ్వు నిజమైన ప్రేమని వాళ్ళకి అందిస్తావు. నువ్వు చాలా మంచి వాడివి, దయగలిగిన వాడివి, నువ్వు సూపర్, నీకు ఎప్పుడూ దేవుడి నుంచి ఆశీస్సులు ఉంటాయి. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలి. దేవుడు నిన్ను ఎప్పుడు దీవిస్తూ ఉంటాడు. అని నారా రోహిత్ పోస్ట్ చేశారు.
మంచు ఫ్యామిలీని మళ్లీ కెలికేసిన నారా రోహిత్..
అసలే అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతుంటే.. మధ్యలో నారా రోహిత్ నీ ఫ్యాన్స్ ని నువ్వు నిజంగా ప్రేమిస్తావు అని, అందుకే వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నారని.. వేరే వాళ్ళు నిజమైన ప్రేమని చూపించట్లేదు అనే అర్థం వచ్చేలాగా నారా రోహిత్ పోస్ట్ చేయడం, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా జరిగిన ఈవెంట్ లోను మీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. లవ్ యు అంటూ నారా రోహిత్ మంచు మనోజ్ కి ధైర్యం చెప్పడం చూసాం. ఇప్పుడు మళ్లీ ఇలా మెసేజ్ పెట్టి మంచు ఫ్యామిలీకి ముఖ్యంగా విష్ణు కి కోపం వచ్చేలా చేశారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ముగ్గురు హీరోలకు కీలకం ..భైరవం
ఇక భైరవం మూవీ మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మంచు మనోజ్ ఈ మూవీలో గజపతి వర్మ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీ చరణ్ అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమా మల్టీ స్టారర్ గా అభిమానుల ముందుకు రానుంది. ముగ్గురు హీరోలు ఎంతోకాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం వారికీ ఎంతో కీలకం.కానుంది ఈ మూవీ రిలీజ్ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Babai, ever wonder why people love you unconditionally? It’s because you’re a true sweetheart—compassionate, kind, and an absolute gem of a person. Stay blessed always and have the amazing birthday you truly deserve. God bless you! @HeroManoj1 #HBDManchuManoj pic.twitter.com/254TzSswUu
— Rohith Nara (@IamRohithNara) May 20, 2025