Geetha Govindam: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), నేషనల్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం గీతగోవిందం (Geetha Govindam) 2018 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాల్లో రష్మిక విజయ్ దేవరకొండ నటనకు ఎంతోమంది అభిమానులతో మారిపోవడమే కాకుండా ఈ సినిమాతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్లు కూడా బయటకు వచ్చాయి. ఇలా తరచూ విజయ్ దేవరకొండ రష్మిక డేటింగ్ రూమర్ల గురించి వార్తలు వస్తున్నా ఇప్పటివరకు వీరిద్దరు ఎక్కడ ఖండించిన దాఖలాలు కూడా లేవు.
కలెక్షన్లు కూడా తగ్గేవి…
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. నిజానికి ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు కాకుండా ముందుగా నారా రోహిత్ కు నటించే అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నారా రోహిత్ భైరవం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే నెల 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి టాక్ సొంతం చేసుకుంది. ఇలా పాజిటివ్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతున్నప్పటికీ చిత్ర బృందం ప్రమోషన్లను మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నారా రోహిత్ గీత గోవిందం సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
విజయ్ దేవరకొండలా నటించే వాడిని కాదేమో..
తాను బాణం సినిమా చేస్తున్న సమయంలోనే గీత గోవిందం సినిమా స్టోరీ లైన్ నాకు చెప్పారు. అయితే కొన్ని కారణాలవల్ల తాను ఈ సినిమాలో నటించలేకపోయానని తెలిపారు. సినిమాలో విజయ్ దేవరకొండ నటన అద్భుతంగా ఉందని , నేను నటించి ఉంటే అంత బాగా నటించే వాడిని కాదేమో అంటూ నారా రోహిత్ తెలిపారు. అదేవిధంగా సినిమా కలెక్షన్లు కూడా అంతలా వచ్చేది కాదు అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ గీతగోవిందం సినిమా కంటే ముందుగా అర్జున్ రెడ్డి వంటి సెన్సేషనల్ సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్నారు. ఇలా అర్జున్ రెడ్డి సక్సెస్ గీతగోవిందం పై మంచి ప్రభావం చూపించిందని, అందుకే గీత గోవిందం సినిమా మంచి సక్సెస్ అందుకుందని తెలిపారు. ఒకవేళ నేను కనుక ఈ సినిమాలో నటించి ఉంటే నా ముందు సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు కనుక గీతగోవిందం సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయేదేమోనని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈయన మాటలు విన్న అభిమానులు మాత్రం ఈ సినిమాలో మీరు నటించి ఉంటే మీకు మంచి సక్సెస్ వచ్చి ఉండేదని , మంచి సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్నారంటూ ఈయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక రోహిత్ కెరియర్ విషయానికి వస్తే ప్రతినిధి 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ, ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయిన తాజాగా భైరవం సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.