BigTV English

Kuberaa: అనగనగా కథ.. అందరికీ తెలిసిన కథ.. ఒక్క సాంగ్ లో మనుషుల తీరు మొత్తం చెప్పేసారుగా

Kuberaa: అనగనగా కథ.. అందరికీ తెలిసిన కథ.. ఒక్క సాంగ్ లో మనుషుల తీరు మొత్తం చెప్పేసారుగా

Kuberaa: టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో కుబేర ఒకటి. క్లాసిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తన ఫంథా మార్చి కమర్షియల్ సినిమాగా కుబేరను రూపొందిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మొట్ట మొదటి సారి కింగ్ నాగార్జున హీరోగా కాకుండా సపోర్టివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ని


 

జం చెప్పాలంటే కుబేర ధనుష్  కోసం కంటే.. నాగ్ కోసమే ఎక్కువమంది చూడడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని ప్రమోషన్స్ కోసం వదిలిన వీడియోస్ లోనే కనిపిస్తున్నాయి. ఇక సాంగ్స్ కూడా ఓ మోస్తరుగా మెప్పించాయి. వాయిదాలు పడుతూ వస్తున్న కుబేర ఎట్టకేలకు జూన్ 20 న రిలీజ్ కు రెడీ అయ్యింది.


 

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా కుబేర ఆడియో లాంచ్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అందులో భాగంగా కొద్దిసేపటి క్రితం ఈ సినిమాలోని ఒక కొత్త లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. అనగనగనగా కథ.. అందరికీ తెలిసిన కథ.. కానీ అంతే తెలియని కథ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమాజంలో మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఈ ఒక్క సాంగ్ లో వివరించారు.

 

లేని వాడికి నోటి ఆకలి.. ఉన్నవాడికి నోట్ల ఆకలి.. నోటికి తెలుసును వద్దు వద్దు.. నోట్లకు తెలియదు హద్దు పద్దు..  అంటూ ఎంతో అద్భుతంగా లిరిక్స్ అందించాడు చంద్రబోస్. వీడియోలో సైతం.. లిరిక్స్ కు తగ్గట్టుగానే నాగార్జున, ధనుష్ ను చూపించారు. ఈ సాంగ్ విన్నాకా.. ఆ వీడియో చూసాకా నాగ్ మంచివాడా.. ? లేక ఇందులో విలనా.. ? అనే డౌట్ రాకమానదు.

 

బెగ్గర్ గా ఉన్న ధనుష్ ను తీసుకొచ్చి వేరొకరి ప్లేస్ లో అతడిని పెట్టినట్లు తెలుస్తోంది. అయితే అది దేనికోసం అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ధనుష్.. సార్ సినిమా లాంటి మరో హిట్ ను అందుకుంటాడా.. ? నాగార్జున మొదటి సపోర్టివ్ రోల్ కు ఫ్యాన్స్ మంచి మార్కులు వేస్తారా.. ? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×