BigTV English

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ అద్భుతమైన సదుపాయం.. జస్ట్ కీచైన్ స్కాన్ చేస్తే చాలు..!

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ అద్భుతమైన సదుపాయం.. జస్ట్ కీచైన్ స్కాన్ చేస్తే చాలు..!

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రజలకు కొత్త కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పుడు కీచైన్‌ స్కాన్‌ చేయగానే.. ఆర్టీసీ ప్రయాణ సమాచారం ఈజీగా తెలుస్తోంది. బస్సు సమాచారం తెలియజేసే గమ్యం యాప్‌‌తో పాటు అఫీషియల్‌ ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సహా పది రకాల సేవలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. జగిత్యాల డిపోలో డిపో మేనేజర్‌ క్యూఆర్‌ కోడ్‌ ఉన్న కీ చైన్‌లను ప్రయాణికులకు అందజేశారు. దీంతో ప్రయాణం మరింత సులభతరం అయ్యిందని ప్రయాణికులు చెబుతున్నారు. మర్యాద వారోత్సవాల్లో భాగంగా వీటిని ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు అందజేస్తున్నారు.


ఒక్క కీ చైన్ స్కాన్ చేస్తే చాలు అర్టీసి ప్రయాణ సమాచారం మొత్తం ఈజీగా తెలిసిపోతుంది. అంతేకాదు ఇంకా పది రకాల సేవలు ఆ ఒక్క కీ చైన్ లోనే ఉంటాయి. ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు జగిత్యాల జిల్లా డిపో అర్టీసి సిబ్బంది వినూత్నమైన కీ చైన్ అందుబాటులోకి తెచ్చారు. టీఎస్ అర్టీసి ప్రజలకి రవాణా మరింత సౌకర్యంగా, అనుకూలంగా మార్చేందుకు సరికొత్త బస్సు ట్రాకింగ్ అమలులొకి తీసుకువచ్చింది. గమ్యం యాప్ లో బస్సులు ఏఏ సమయాల్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇప్పుడు జగిత్యాల జిల్లా అర్టీసి‌ సిబ్బంది మర్యాద వారోత్సవాలలో భాగంగా ప్రయాణికులకి గమ్యం యాప్ కి సంబంధించిన సమగ్ర సమాచార కీ చైన్ లు పంపిణీ చేశారు.

ALSO READ: Cobra: వామ్మో.. రాత్రికి రాత్రే ఈ రెండు నాగుపాములు చేసిన పనికి..? వీడియో వైరల్


ప్రస్తుత రోజుల్లో.. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు కదా.. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయగానే సెర్చ్ బార్ ప్రక్కన కెమెరా గుర్తు ఉంటుంది. దానిని ప్రెస్ చేయగానే గూగుల్ లెన్స్ ఓపెన్ అవుతుంది. అందులో కీ చైన్ పై ఉన్న క్యూ అర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు అర్టీసి కి సంబంధించిన పది రకాల సేవలకి‌ సంబంధించిన యాప్ లు, వెబ్ సైట్లు కనిపిస్తాయి. ఇందులో ప్రయాణికుడికి కావాల్సిన‌ సమాచారం మొత్తం ఉంటుంది.

ALSO READ: AP News : ఏపీలో వజ్రాల KGF.. కమాన్ రాఖీ బాయ్స్..

దీనిలో మనకి కావాల్సిన యాప్ సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు. యాప్ కి సంబంధించిన వాటిని ఎలాంటి డౌన్ లోడ్ చేసుకోవల్సిన అవసరం లేకుండానే మనకి ఇప్పుడు ఈ కీ చైన్ ఉంటే చాలు. గూగుల్ లో అర్టీసికి‌ సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు. ఇప్పుడు క్యూ ఆర్ కోడ్ గల కీ చైన్ డిజిటల్ యుగంలో మనకి చాల రకాలుగా ఉపయోగపడుతుంది.

Related News

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Big Stories

×