Big Stories

Delhi High Court: లవ్ ఫెయిల్యూర్ వల్ల అబ్బాయి సూసైడ్ చేసుకుంటే అమ్మాయి జవాబుదారీ కాదు..

Delhi High Court: లవ్ ఫెయిల్యూర్ కారణంగా ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోతే, ఆ వ్యక్తి ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు మహిళ జవాబుదారీ కాదని, తను బాధ్యత వహించదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఇద్దరు వ్యక్తులకు ముందస్తు అరెస్టు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బలహీనమైన మనస్తత్వంతో తీసుకున్న నిర్ణయాలకు వేరొక వ్యక్తిని బాధ్యులు చేయడం అన్యాయమని కోర్టు నొక్కి చెప్పింది.

- Advertisement -

ఏప్రిల్ 16న జస్టిస్ అమిత్ మహాజన్‌తో కూడిన సింగిల్ జడ్జి ధర్మాసనం తన ఉత్తర్వుల్లో, “ప్రేమ వైఫల్యం కారణంగా ఒక ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటే, పరీక్షలో తన పేలవమైన ప్రదర్శన కారణంగా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే, ఒక క్లయింట్ తన కేసు కారణంగా ఆత్మహత్య చేసుకుంటే.. మహిళ, ఎగ్జామినర్, న్యాయవాది వరుసగా ఆత్మహత్యకు ప్రేరేపించారని భావించలేము.” అని పేర్కొన్నారు.

- Advertisement -

Delhi High Court

కేసు ఏమిటి?

2023లో ఒక వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులు(ఒక మహిళ, ఆమె స్నేహితుడికి) ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

వ్యక్తి తండ్రి చేసిన ఫిర్యాదులో.. మహిళ గతంలో అతని కొడుకుతో శృంగార సంబంధం కలిగి ఉందని.. ఇంకొక మహిళ ఇద్దరికి పరస్పర స్నేహితురాలని పేర్కొన్నాడు. ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని భావించారని.. కానీ వీరిద్దరి వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతని రూంలో సూసైడ్ నోట్ దొరికిందని తెలిపాడు.

కోర్టు చెప్పింది ఏంటి?

మృతుడు తన సూసైడ్ నోట్‌లో ఇద్దరు మహిళల పేర్లను పేర్కొన్నట్లు హైకోర్టు అంగీకరించింది. అయినప్పటికీ, ఒక సాధారణ వ్యక్తి తమ ప్రాణాలను తీసుకునేలా బెదిరింపులు తీవ్రంగా ఉన్నాయని సూచించడానికి నోట్‌లో ఏమీ కనిపించలేదు. “ప్రథమంగా, సూసైడ్ నోట్‌ ఇద్దరి మహిళల వల్ల మరణించిన వ్యక్తి వేదనను మాత్రమే వ్యక్తం చేసిందని, అయితే మరణించిన వ్యక్తి ఆత్మహత్యకు దారితీసే ఉద్దేశ్యం ఏదైనా ఉందని ఊహించలేము” అని హైకోర్టు పేర్కొంది.

సాక్ష్యంగా సమర్పించిన వాట్సాప్ చాట్‌ల ఆధారంగా, మృతుడు సున్నితమైన స్వభావం కలిగి ఉన్నాడని, అతనితో మాట్లాడటానికి నిరాకరించినప్పుడల్లా ఆత్మహత్య చేసుకుంటానని ఆమెను నిరంతరం బెదిరించేవాడని కోర్టు పేర్కొంది.

Also Read: నా ఆస్తులు రూ.1400 కోట్లు, దుబాయ్, లండన్‌..!

కస్టోడియల్ ఇంటరాగేషన్ ఉద్దేశ్యం దర్యాప్తుకు సహాయం చేయడమేనని.. ఇది శిక్షార్హమైనది కాదని, ఇద్దరు మహిళలకు కస్టడీ విచారణ అవసరం లేదని పేర్కొంటూ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణలో పాల్గొని విచారణకు సహకరించాలని దరఖాస్తుదారులను ఆదేశించింది.

ఎవరైనా బెయిల్ షరతులను ఉల్లంఘించిన పక్షంలో బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌ను దాఖలు చేయడానికి రాష్ట్రానికి స్వేచ్ఛ ఉంటుందని కోర్టు పేర్కొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News