Pawan Kalyan Camp office: గత రెండు రోజులుగా జనసేన పార్టీ కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ డ్రోన్ ఘటన వెలుగులోకి రాగానే పవన్ కళ్యాణ్ భద్రతపై జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఎట్టకేలకు డ్రోన్ ఎగిరిన కేసును పోలీసులు ఛేదించారు.
మంగళగిరి లోని జనసేన ప్రధాన కార్యాలయం పై రెండు రోజుల క్రితం డ్రోన్ ఎగిరినట్లు స్థానిక నాయకులు గుర్తించారు. తమ పార్టీకి సంబంధించినది కాకపోవడంతో, అసలు ఆ డ్రోన్ ఎందుకు పార్టీ కార్యాలయం పైకి వచ్చిందన్న అనుమానాలను జనసేన అగ్ర నాయకులు వ్యక్తం చేశారు. అంతేకాకుండా మంగళగిరి పోలీసులకు జనసేన ఫిర్యాదు చేసింది. సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమల రావు కూడా ఇదే విషయంపై మాట్లాడారు. డ్రోన్ ఎగిరిందా లేదా అన్న కోణంలో కూడా విచారణ సాగుతుందని, త్వరలోనే అసలు విషయాన్ని ప్రకటిస్తామంటూ డీజీపీ చెప్పారు.
అలా డీజీపీ ప్రకటన ఇచ్చారో లేదో డ్రోన్ ఎగిరిన ఉదంతంపై సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీ కార్యాలయం పై డ్రోన్ ఎగిరిన విషయం వాస్తవమేనని, అయితే ఆ డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థదిగా పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య, కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేసేందుకు మంగళగిరిని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. అందులో భాగంగానే డ్రోన్ మంగళగిరిలోని టీడీపీ, జనసేన పార్టీ కార్యాలయాలపై ఎగిరినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. గత రెండు రోజులుగా రహస్య డోన్ ఎగిరిందని ఆందోళన పడుతున్న జనసేన నాయకులు అసలు విషయం తెలిసి ఊరట చెందారు.
Also Read: TDP – YCP: అమిత్ షా వార్నింగ్? టెన్షన్‌లో ఉన్న ఆ ఇద్దరెవరు?
గత ఏడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మంత్రి వంగలపూడి అనితలకు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెల్సిందే. పోలీసులు 12 గంటల వ్యవధిలోనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మళ్ళీ అనుమానస్పదంగా డ్రోన్ సంచరించడంతో జనసేన నాయకులు కాస్త కంగారు పడ్డారు. ఎట్టకేలకు డ్రోన్ వ్యవహారానికి పోలీసులు తెరదించారు.
పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ ఎగిరిన ఘటనపై అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవి కుమార్ క్లారిటీ
ఆ డ్రోన్ ఏపీ ఫైబర్‌కు చెందినదిగా తేల్చినట్లు స్పష్టం
మంగళగిరి ప్రాంతంలో ట్రాఫిక్, శానిటేషన్, రోడ్లు తదితర అంశాలపై చేస్తున్న పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఫైబర్ నెట్ అధికారులు డ్రోన్… https://t.co/LNgHYeCCwg pic.twitter.com/xvFpAk4EKO
— BIG TV Breaking News (@bigtvtelugu) January 20, 2025