BigTV English

Volcanoes : కార్బన్ డయాక్సైడ్‌ను స్టోర్ చేసుకునే అగ్నిపర్వతాలు.. కొత్త టెక్నిక్‌తో..

Volcanoes : కార్బన్ డయాక్సైడ్‌ను స్టోర్ చేసుకునే అగ్నిపర్వతాలు.. కొత్త టెక్నిక్‌తో..

Volcanoes : ప్రస్తుతం గాలిలో పెరుగుతున్న కాలుష్యానికి ముఖ్య కారణంగా మారుతోంది కార్బన్ డయాక్సైడ్. ఈరోజుల్లో పెరుగుతున్న టెక్నాలజీలో భాగంగా గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం కూడా అలాగే పెరుగుతోంది. ఏది తయారు చేసినా అందులో నుండి కార్బన్ విడుదలవ్వడం కామన్‌గా మారిపోయింది. అందుకే కాలుష్యాన్ని తగ్గించడానికి కార్బన్ విడుదలను తగ్గించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అదే క్రమంలో వారు ఒక కొత్త విషయం తెలుసుకున్నారు.


అగ్నిపర్వతాలు అనేవి దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల ఉన్నాయి. ఇవి బద్దలయినప్పుడు వచ్చే లావాలో ఎన్నో రకాల గ్యాసులు విడుదల అవుతాయని ఇప్పటికే శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. అయితే అగ్నిపర్వతాల నుండి లావా విడుదల అవ్వకపోయినా.. కార్బన్ డయాక్సైడ్ అయ్యేది స్టోర్ అవుతుందని శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధారించారు. ఇలాంటి అగ్నిపర్వతాల్లో 1.2 నుండి 8.6 గిగాటన్స్ కార్బన్ డయాక్సైడ్ ఉంటుందని వారి పరిశోధనల్లో తేలింది. ఇది ఇండస్ట్రీలలో నుండి 24 నుండి 125 సంవత్సరాల విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్‌తో సమానం.

గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరుగుతుండడంతో 2022లో 42.6 కార్బన్ శాతాన్ని గాలిలో నుండి తొలగించడం కోసం శాస్త్రవేత్తలు కష్టపడ్డారు. అయితే అండర్‌వాటర్‌లో ఉండే అగ్నిపర్వతాలు లేదా బద్దలు అవ్వడానికి సిద్ధంగా లేని అగ్నిపర్వతాలు అనేవి కార్బన్ డయాక్సైడ్‌ను, గ్రీన్‌హౌస్ గ్యాసులను వాటిలో దాచుకుంటున్నాయని తేల్చారు. దీని వల్ల గాలినుండి కార్బన్ శాతాన్ని తగ్గించడం కోసం కొత్త మార్గాన్ని కనిపెట్టే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు.


ఎన్నో దేశాలు ప్రస్తుతం గాలి నుండి కాలుష్యం శాతాన్ని తీయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. దానికోసం ఎంత ఖర్చు చేస్తున్నాయి కూడా. కానీ ఇప్పటివరకు ఏ దేశం కూడా ఇందులో పూర్తిగా సక్సెస్‌ఫుల్ కాలేదు. ‘ఇన్ సుటి మినరల్ కార్బనైజేషన్’ అనే ప్రక్రియ ద్వారా గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను అగ్నిపర్వతాల్లో స్టోర్ చేసే టెక్నాలజీని కనుక్కోవాలని అనుకుంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే అందులో 1.2 నుండి 8.6 కార్బన్ డయాక్సైడ్‌ను స్టోర్ చేయవచ్చని నిర్ధారించిన శాస్త్రవేత్తలు.. త్వరలోనే ఈ పరిశోధనలను పూర్తిస్థాయిలో కొనసాగించనున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×