Narne Nithin – Sangeeth Sobhan: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడుగా నిలదొక్కుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. టాలెంట్ ఉంటే చాలు ఖచ్చితంగా వాళ్ళకంటూ కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇండస్ట్రీలో టాలెంట్ లేకపోతే ఎవరూ కాపాడలేరు. చాలామంది చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ప్రూవ్ చేసుకొని తమకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సాధించుకున్నారు. చిన్న చిన్న పాత్రలు వేసి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు నేడు హీరోలు కూడా అయిపోయారు. చాలామంది మల్టీ టాలెంటెడ్ నటులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేశారు. కేవలం నటులుగా మాత్రమే కాకుండా రచయితగాను దర్శకుడుగా గాను ఎక్స్ట్రా టాలెంట్లు చూపిస్తున్నారు. అలానే ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నర్నే నితిన్, సంగీత్ శోభన్ లకు కూడా మంచి గుర్తింపు ఉంది.
మ్యాడ్ సినిమాతో గుర్తింపు
బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ఎంటర్టైన్ ఉంటుంది అని అంటే ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్ కు వస్తారు అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయింది అంటే అదే తరహాలో కొన్ని సినిమాలు వస్తూ ఉండటం కామన్ గా జరుగుతుంది. అనుదీప్ కె.వి జాతి రత్నాలు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా దాదాపు 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అదే తరహాలో వచ్చిన సినిమా మ్యాడ్. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించి మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. నర్ని నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్ ఈ సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నారు.
పాత సినిమాలు రిలీజ్
ఒక సినిమా బ్రేక్ రావడానికి అంటే ముందు ఆ నటులు కొన్ని సినిమాలు సైన్ చేసి నటించి కూడా ఉంటారు. కొన్ని కారణాల వలన ఆ సినిమాలు విడుదలకు నోచుకోవు. అయితే ఒక సినిమా హిట్ అయినప్పుడు పాత సినిమాలను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడో చేసిన సినిమాలు అని చాలామంది ఆడియన్స్ కి తెలియక థియేటర్ కి వెళ్లి బుక్ అయిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక ఎప్పుడు వారిద్దరు వేరువేరుగా నటించిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. నర్ని నితిన్ శ్రీ శ్రీ రాజా వారు, సంగీత్ శోభన్ నటించిన గ్యాంబ్లర్స్ సినిమాలు జూన్ 6న రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి.
Also Read: Manchu Mohan Babu : సందర్భంతో సంబంధం లేదు, స్వ-డబ్బా నే అసలు ఎజెండా