BigTV English

Manchu Mohan Babu : సందర్భంతో సంబంధం లేదు, స్వ-డబ్బా నే అసలు ఎజెండా

Manchu Mohan Babu : సందర్భంతో సంబంధం లేదు, స్వ-డబ్బా నే అసలు ఎజెండా

Manchu Mohan Babu : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకరు. ఒకప్పుడు మోహన్ బాబు సినిమాలకు కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఉండేవాళ్ళు. తర్వాత కాలంలో ఆ ఆడియన్స్ కూడా పూర్తిగా తగ్గిపోయారు. ఇక రీసెంట్ టైమ్స్ లో ఆడియన్స్ థియేటర్కు వచ్చి సినిమాలు చూడటం మానేశారు అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా థియేటర్లో అమ్మే పాప్కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు పెరగడం కూడా ఒక పెద్ద రీజన్. అలానే టిక్కెట్ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు థియేటర్లో విడుదలైన సినిమా మూడు వారాల పోతే ఓటిటి కూడా వచ్చేస్తుంది. ఈ తరుణంలో థియేటర్ కు భారీ ఖర్చు పెట్టుకుని వచ్చి సినిమా చూసి ఆడియన్స్ లేరు.


మంచు ఫ్యామిలీకి ఆదరణ తగ్గింది 

ఇక మంచు మోహన్ బాబు ఫ్యామిలీ విషయానికి వస్తే, కొంతకాలం హీరోగా సినిమాలు చేసిన తర్వాత ఫెయిల్యూర్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత కాలంలో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టారు. మళ్లీ హీరోగా సినిమాలు చేసినా కూడా ఊహించని స్థాయిలో అవి సక్సెస్ కావడం లేదు. డైమండ్ రత్నం దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ ఇండియా సినిమా విషయానికి వస్తే ఆ సినిమాను కనీసం 50 మంది కూడా చూసిన దాఖలాలు లేవు. అలానే ఎన్నో వంచనాల మధ్య వచ్చిన మంచు విష్ణు జిన్నా సినిమా కూడా అదే పరిస్థితి. వీళ్ళ సినిమాలకు ఆదరణ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు స్టేజ్ ఎక్కిన ప్రతిసారి తన గొప్పతనాన్ని చెప్పడమే. ఇది వినే వాళ్లకు కొంతవరకు బాగుంటుంది. కానీ ఎప్పుడూ అదే చెప్తే చిరాకు పుడుతుంది.


మళ్లీ అదే తంతు 

ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నప్ప అనే సినిమాను మోహన్ బాబు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో భారీ తారాగణం కనిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో రుద్ర అనే ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అలానే మోహన్ లాల్, ముఖేష్ రిషి, అక్షయ్ కుమార్ వంటి పెద్ద పెద్ద నటులు కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ కన్నడలో నిర్వహించారు. ఇక్కడ కూడా మంచు మోహన్ బాబు రాజకుమార్, అంబరీష్ గురించి మాట్లాడుతూ తర్వాత తన గొప్పతనాన్ని చెప్పడం మొదలుపెట్టారు. 1985 నంబర్ 22న నా సినిమా విడుదలైంది. మా గురువుగారు దాసరి నారాయణరావు గారు. నా సినిమా హిట్ అవ్వాలి అనే జలసి నాకు కూడా ఉండేది. నాకు టెంపర్ ఎక్కువ. మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అంటూ మళ్ళీ తన గతాన్ని మొదలుపెట్టి డబ్బా కొట్టే ప్రయత్నం చేశారు. స్టేజ్ ఎక్కిన ప్రతిసారి మాట్లాడటం కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమా ప్రమోషన్స్ లో కూడా వీటిని మాట్లాడటం చాలామందికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×