E-Paper
Advertisement

Bharat Bandh: జూన్ 10న భారత్ బంద్.. ఎందుకో తెల్సా?

Bharat Bandh: జూన్ 10న భారత్ బంద్.. ఎందుకో తెల్సా?
Advertisement

Bharat Bandh: మావోయిస్ట్ కేంద్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 10న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఛత్తీస్ గఢ్‌లో 27 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్‌కు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు. అలాగే ఆ మరుసటి రోజు జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల స్మారక సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

పది రోజుల క్రితం ఛత్తీస్ గఢ్, నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ అటవీ పరిధిలో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ లో 27 మంది మావోలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ కగార్ లో మావో కీలక నేతలు మృతిచెందారు. అయితే ఈ ఎన్ కౌంటర్‌లో చనిపోయిన తెలుగు రాష్ట్రాల మావోల మృతదేహాలను పోలీసులు కుటుంబ సభ్యులకు కూడా అప్పగించలేదు.

Advertisement

ALSO READ: DME Recruitment: ఆ జిల్లాలో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే జీతం అక్షరాల రూ.54,000

ఈ క్రమంలోనే.. భద్రతా బలగాల దాడిలో 27 మంది మావోయిస్టు నేతలు మృతి చెందడాన్ని నిరసిస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌ను దేశవ్యాప్తంగా జరిపేందుకు మావోయిస్టు నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే.. భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాయి.

Advertisement

గతేడాది 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్టు మావోయిస్టు నేతలు వెల్లడించారు. తాము శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటకీ.. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను ఆపడం లేదని చెప్పారు. గత రెండు నెలలుగా సంయమనం పాటించామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ఫాసిస్ట్ వైఖరికి నిరసనగా జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిస్తున్నామని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఈ రోజు లేఖను విడుదల చేశారు.

ALSO READ: Telangana : గోశాలలపై సీఎం రేవంత్ ఫోకస్.. బీజేపీకి చెక్?

Related News

జీతం రూ.63000.. పదో తరగతి ఉంటే చాలు.. ఇండియా పోస్ట్‌లో డ్రైవర్ జాబ్స్

కుమారుడు ఉదయనిధి అరెస్ట్.. సీఎం విజయ్‌పై విరుచుకుపడ్డ ఎం.కె. స్టాలిన్!

ఉదయనిధి స్టాలిన్‌ అరెస్టు వ్యవహారం.. విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం

E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ నిరసన.. ప్రధాని నివాసానికి పాదయాత్ర!

త్రిషపై కామెంట్స్ వ్యవహారం.. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ అరెస్ట్, బెయల్ కోసం హైకోర్టుకు

వాహనదారులకు బిగ్ అలర్ట్.. వాహనాల్లోకి వీ2వీ వ్యవస్థ, ఎన్ని ఉపయోగాలో తెలుసా?

పీకే గెలుపుతో బీహార్ రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీలో నిశ్శబ్దం-ఆపై లుకలుకలు, నితీష్‌కుమార్ రీఎంట్రీ?

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

Big Stories

Advertisement
×