BigTV English

Sri Sri Sri Rajavaru: ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ విచ్చేస్తున్నారు.. నేషనల్ అవార్డ్ దర్శకుడితో నార్నే నితిన్ సినిమా

Sri Sri Sri Rajavaru: ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ విచ్చేస్తున్నారు.. నేషనల్ అవార్డ్ దర్శకుడితో నార్నే నితిన్ సినిమా

Sri Sri Sri Rajavaru Release Date: ఎన్‌టీఆర్ ఫ్యామిలీ నుండి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నార్నే నితిన్. మొదటి సినిమా ‘మ్యాడ్’తోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇటీవల తను నటించిన ‘ఆయ్’ కూడా పాజిటివ్ టాక్ అందుకుంది. దీంతో నార్నే నితిన్ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. ఇదే సక్సెస్ స్ట్రీక్‌ను కంటిన్యూ చేయడం కోసం మరో సినిమాతో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాడు ఈ యంగ్ హీరో. ‘ఆయ్’ విడుదలయ్యి నెలరోజులు అవ్వకముందే తన తరువాతి చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను బయటపెట్టాడు నితిన్. ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే మూవీతో రానున్నట్టు చెప్తూనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని కూడా బయటపెట్టాడు.


భారీగా విడుదలకు ప్లాన్

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రమే ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. ఇప్పటికే ‘శతమానం భవతి’ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దర్శకుడు సతీష్. దాంతో నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. అలాంటి మరొక ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాతోనే నార్నే నితిన్‌కు హ్యాట్రిక్ హిట్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’లో నార్నే నితిన్‌కు జోడీగా సంపద నటిస్తోంది. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్‌పై చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అత్యధిక థియేటర్లలో ఈ చిత్రం విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ‘మ్యాడ్’, ‘ఆయ్’తో యూత్‌లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న నార్నే నితిన్‌కు హ్యాట్రిక్ హిట్ రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.


Also Read: పండగ సందర్భంగా ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కాంప్రమైజ్ అవ్వలేదు

‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ విడుదల తేదీని ప్రకటించి తర్వాత నిర్మాత చింతపల్లి రామారావు.. మీడియాతో మాట్లాడారు. ‘‘ముందుగా తెలుగు ప్రేక్షకులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన హీరో నార్నే నితిన్ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌తో అలరించారు. శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా విషయానికొస్తే ఇది పల్లెటూరు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఫ్యామిలీ చిత్రం. సతీష్ వేగేశ్న దీనిని ఒక కమర్షియల్ సినిమాగా మార్చారు. ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అయ్యేలా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ దసరాకు నార్నే నితిన్‌కు హ్యాట్రిక్ హిట్ దక్కడం ఖాయం’’ అని మూవీ సక్సెస్‌పై ధీమా వ్యక్తం చేశారు.

టెక్నికల్ టీమ్

‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’లో నార్నే నితిన్, సంపదతో పాటు రావు రామేశ్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియా మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి వంటి నటీనటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని కైలాష్ మీనన్ అందిస్తున్నారు. దాము నర్రవులా సినిమాటోగ్రాఫీ బాధ్యతలు స్వీకరించగా మధు ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో పాటలను శ్రీమణి రాస్తున్నారు. రాజీవ్ కుమార్, వీ శర్మ.. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. చింతపల్లి రామారావుతో పాటు ఎమ్ సుబ్బారెడ్డి కూడా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ నిర్మాణంలో పాల్గొంటున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×