Natti Karuna: ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీలు ప్రేమలో పడి అభిమాను ఆశ్చర్యపరిస్తే.. ఇంకొంతమంది రహస్యంగా వివాహం చేసుకొని హాట్ టాపిక్ గా మారుతున్నారు ఇంకొంతమంది వివాహం చేసుకొని ఒక బిడ్డకు లేక కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత తమకు పెళ్లయింది అంటూ మీడియాతో చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా ఒక హీరోయిన్.. నెల రోజుల క్రితమే వివాహం చేసుకొని, తాజాగా ఆ ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో బయట పెట్టడంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. మరి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్..
ఆమె ఎవరో కాదు నట్టి కరుణ (Natti Karuna). సినీ ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తో ఎక్కువ సినిమాలు చేస్తూ.. వివాదాల్లో కూడా నిలిచారు నిర్మాత నట్టికుమార్ (Natti Kumar). నిర్మాతగా, దర్శకుడిగా పలు సినిమాలు చేసిన ఈయన ఇటీవల సమంతపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొకసారి కూతురు పెళ్లి ద్వారా వార్తల్లో నిలిచారు. నట్టి కరుణ పలు సినిమాలకు, నిర్మాతగా వ్యవహరించి, దెయ్యంతో సహజీవనం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. దాదాపు నెల రోజుల క్రితం నట్టి కరుణ వివాహం చేసుకుంది. తాజాగా తన నిశ్చితార్థం , పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఫిట్నెస్ ట్రైనర్ తో ఏడడుగులు..
ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ నిఖిల్ గూడూరి (Nikhik guduri) అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. నిఖిల్ ఫిట్నెస్ ట్రైనర్ గా, న్యూట్రిషన్ గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ కలిసి తమ పెళ్ళి ఫోటోలను షేర్ చేయడంతో పాటు వన్ మంత్ యానివర్సరీ అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేశారు.
నట్టి కరుణ పోస్ట్..
నట్టి కరుణ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ ఇలా రాసుకుంది. ” అమ్మా.. నాన్న.. అత్తయ్య.. మామయ్య.. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరి సపోర్టు, ఆశీర్వాదాల వల్లే ఇప్పుడు నేను ఇష్టపడిన వ్యక్తిని నా జీవితంలోకి తీసుకురాగలిగాను. బుజ్జు (నిఖిల్) నువ్వు నా జీవితంలోకి రావడం ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాగే ఎన్నో నెలలు, సంవత్సరాలు పాటు మనిద్దరం ప్రేమ, ఫన్, ఫైట్, అండర్స్టాండింగ్స్ , మిస్ అండర్స్టాండింగ్, ట్రిప్స్ , అడ్వెంచర్స్, పిక్చర్స్ ఇలా అన్నింటిని మన జీవితంలో కలిగి ఉండాలి.. నువ్వు లేనిదే నేను లేను” అంటూ ఒక సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది నట్టి కరుణ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు నట్టి కరుణ – నిఖిల్ దంపతులకు సినీ సెలబ్రిటీలు, అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నట్టి కరుణ కెరియర్..
నట్టి కరుణ విషయానికి వస్తే.. మిస్ ఫ్యాషన్ ఐకాన్ ఢిల్లీ 2022 లో పోటీపడి, టైటిల్ గెలుచుకున్న ఈమె నటిగా, ప్రొడ్యూసర్ గా కూడా పేరు సొంతం చేసుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోలతో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా పెళ్లిపీటలెక్కి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.