Akhanda 2 : చాలామంది సీనియర్ హీరోయిన్లు ఇప్పుడు మరోసారి తెరపై మెరవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్ (Jr NTR) హీరోయిన్ బాలయ్య (Nandamuri Balakrishna) సినిమాలో భాగం కాబోతోంది అన్న వార్త తెరపైకి వచ్చింది. ఈ బ్యూటీ మరెవరో కాదు అంకిత (Ankitha).
బాలయ్య (Balakrishna) అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘అఖండ 2 : తాండవం’ (Akhanda 2). బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘అఖండ సినిమా. దీనికి సీక్వెల్ గా రాబోతోంది ‘అఖండ 2 : తాండవం’. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న విషయాన్ని ఇంకా మేకర్స్ ప్రకటించలేదు. దీంతో ‘అఖండ 2’లో హీరోయిన్ అంటూ పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి.
ఇక ‘అఖండ’ సినిమాలో పూర్ణ కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే. తాజాగా ‘అఖండ 2 : తాండవం’ (Akhanda 2) మూవీతో ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ అంకిత (Ankitha) రీఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది. తాజాగా ఆమె డైరెక్టర్ బోయపాటితో కలిసి దిగిన ఫోటో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ సినిమాలో అంకిత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపింది. దీంతో అంకితకు మంచి స్టార్డం వచ్చింది. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే ఈ బ్యూటీ వరుస డిజాస్టర్లతో ఫేడ్ అవుట్ అయ్యింది. ఇక ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అంకిత త్వరలోనే రీ ఎంట్రీ ఇస్తాను అని కొన్నాళ్ల క్రితనే వెల్లడించింది. అన్నట్టుగానే ఇప్పుడు డైరెక్టుగా బాలయ్య సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
గతంలో బాలయ్యతో కలిసి అంకిత (Ankitha) ‘విజయేంద్ర వర్మ’ అనే సినిమాలో నటించింది. మరి ఇప్పుడు ‘అఖండ 2 : తాండవం’లో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. అలాగే ఈ అమ్మడికి రీఎంట్రీ కలిసి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ‘అఖండ 2 : తాండవం’ (Akhanda 2) మూవీకి సంబంధించిన భారీ సెట్ వర్క్ జరుగుతుంది ఇప్పుడు. డిసెంబర్ మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగబోతుందని సమాచారం.
ఇక ఈ సినిమాలో బాలయ్య శివుని భక్తుడిగా కనిపించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ లో మొట్టమొదటిసారిగా బాలయ్య అఘోర పాత్రలో కనిపించడం అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఇదిలా ఉండగా బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాలకు ప్రత్యేకంగా ఓ వర్గం అభిమానులు కూడా ఉంటారు. అలా బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు హ్యాట్రిక్ హిట్ ను నమోదు చేసుకున్నాయి. ఇప్పుడు ‘అఖండ’ సీక్వెల్ గా రాబోతున్న ‘అఖండ 2 : తాండవం’ (Akhanda 2) మూవీ పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.