E-Paper
Advertisement

Nani: నటన వద్దనుకున్నా.. కానీ.. నాని జర్నీ సాగిందిలా..

Nani: నటన వద్దనుకున్నా.. కానీ.. నాని జర్నీ సాగిందిలా..
Advertisement

Nani: నానీ నటన ఎంత న్యాచురల్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే అతడికి న్యాచురల్ స్టార్ అని పేరు వచ్చింది. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు నాని. తన నటనతో కోట్లాది మంది హృదయాలు గెలుచుకున్నాడు. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి ఆదర్శంగా నిలిచాడు.

అయితే నానికి సినిమాల్లోకి రావాలనే కోరిక చిన్నప్పటి నుంచే ఉంది. అప్పటి నుంచే సినిమాలు రిలీజ్ అయిన ప్రతి సినిమాను వదలకుండా చూసేవాడు. ఒక ఏజ్ వచ్చాక తన ఫొటో ఆల్బమ్ పట్టుకొని స్టూడియోల చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు. చెప్పులు అరిగాయే తప్ప అవకాశాలు రాలేదు. ఒకానొక సమయంలో ఇక అవకాశాలు రావు అనుకొని ప్రయత్నాలు మానేద్దామనుకున్నాడు నాని.

Advertisement

హీరోగా ప్రయత్నాలు మాని.. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వైపు ప్రయ్నాలు మొదలు పెట్టాడు. డైరెక్టర్ బాపు దగ్గర క్లాప్ అసిస్టెంట్‌గా చేరాడు. ఆ తర్వాత పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, రేడియో జాకీగా నాని పని చేశాడు. కొద్దిరోజులకు డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు.

అప్పుడు మోహనకృష్ణ అష్టాచమ్మా సినిమా కోసం హీరోని వెతుకుతున్నాడు. అదే సమయంలో నాని మోహనకృష్ణ కంట్లో పట్డాడు. అంతే హీరోగా నానికి అవకాశం వచ్చింది. ఆ సినిమాలో రాంబాబు పాత్రలో నటించి అదరగొట్టాడు. అంతే ఇక నాని వెనుదిరిగి చూసుకోలేదు. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరో వరకు ఎదిగాడు.

Advertisement

నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×