BigTV English

Dalai Lama: దలైలామా వారసుడు ఆ అమెరికా బాలుడేనా? చైనా ఊరుకునేనా?

Dalai Lama: దలైలామా వారసుడు ఆ అమెరికా బాలుడేనా? చైనా ఊరుకునేనా?

Dalai Lama: దలైలామా మరోసారి వార్తల్లో నిలిచారు. బుద్దిజంలో కీలక పదవికి అమెరికాలో పుట్టి పెరిగిన ఎనిమిదేళ్ల మంగోలియా బాలుడిని ఎంపిక చేయడమే అసలు విషయం. దలైలామా ఏ పని చేసినా వ్యతిరేకించే చైనా ఇప్పుడు కూడా గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. టిబెటన్ బుద్ధిజంలో మూడో అతిపెద్ద పదవికి మంగోలియా బాలున్ని ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. దలైలామా కూడా వయోభారంతో ఉన్నారు. తన తదుపరి వారసుడి ఎంపికపై మౌనం వీడకపోయినా గతంలోనే చైనా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. 15వ దలైలామాను తామే ఎంపిక చేస్తామంటోంది. ఇంతకీ కొత్త పదవికి ఎనిమిదేళ్ల బాలున్ని ఎలా ఎంపికచేశారు?


దలైలామా…. ఈ పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది బౌద్ధుల హృదయాలు పులకించిపోతాయి. దలైలామా బుద్ధుల మత గురువే కాదు టిబెట్ ప్రాంతానికి ఆత్మలాంటి వారు. టిబెట్ స్వాతంత్ర్యం కోసం దశాబ్దాలుగా అహింసాయుతంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు దలైలామా మరోసారి వార్తల్లోకి వచ్చారు. టిబెటన్ బౌద్ధంలో ఏ కీలక పదవులు కట్టబెట్టాల్సి వచ్చినా డ్రాగన్ రంగంలోకి దిగుతుంటుంది. బెదిరిస్తుంది. కానీ ఇప్పుడు దలైలామా ధైర్యంగా ఓ ముందడుగు వేసి టిబెటన్ బౌద్ధంలో మూడో అతిపెద్ద పదవికి ఒక ఎనిమిదేళ్ల బాలున్ని ఎంపిక చేసి కిరీటం పెట్టేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కీలక విషయంగా మారింది.

బౌద్ధంలో దలైలామాలంతా బుద్ధుని అంశ అయిన అవలోకేశ్వరుని పునర్జన్మలని బౌద్ధుల నమ్మకం. ఇది అత్యున్నత పదవి. దలైలామా మరణిస్తే, మళ్ళీ ఇంకో చోట పుట్టి, మళ్ళీ దలైలామాగా పగ్గాలు చేపడతాడని బౌద్ధుల విశ్వాసం. టిబెటన్ బుద్ధిజంలో రెండో అతిపెద్ద పదవి పంచెం లామా. అలాగే మూడో అతిపెద్ద పదవి ఖల్కా జస్టన్ ధంపా రిన్ పోచె. ఇప్పుడు ఈ మూడో అతిపెద్ద పదవికి అందరూ ఆశ్చర్యపోయేలా… జన్మతః అమెరికన్ అయిన ఎనిమిదేళ్ల మంగోలియా బాలుడిని ఎంపిక చేశారు దలైలామా. మార్చి 8న హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.


దలైలామా వయసు 87 ఏళ్లు. నిజానికి ఆయన తన తర్వాత దలైలామాను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఓవైపు చైనా హెచ్చరికలు, ఇంకోవైపు ప్రతికూల పరిస్థితులతో ఆయన ఏ ప్రకటనా చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే మూడో అతిపెద్ద పదవికి బాలున్ని ఎంపిక చేయడం కీలకంగా మారింది. ఈ పిల్లాడు ఓ ప్రొఫెసర్ కొడుకు. మంగోలియా పార్లమెంట్ మాజీ సభ్యుడి మనవడిగా చెబుతున్నారు.

టిబెట్ అంతా నాదే అనుకుంటుంది చైనా. అందుకే బౌద్ధుల విషయాల్లో, వారి పదవుల విషయాల్లో ఎప్పుడూ తలదూరుస్తుంటుంది. ఎవరి పేరు ప్రకటిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన బౌద్ధుల్లో కనిపిస్తుంది. టిబెటిన్ బుద్ధిజంలో రెండో అతిపెద్ద పదవి పంచెన్ లామా. 11వ పంచెన్ లామా పదవికి 1995లో దలైలామా ఎంపిక చేశారు. వెంటనే డ్రాగన్ రంగంలోకి దిగి అతన్ని అతడి కుటుంబాన్ని కిడ్నాప్ చేసింది. అతడు ఇప్పటి వరకు కనిపించలేదు. మాట వినిపించలేదు. అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అంత పని చేసింది డ్రాగన్. ఆ తర్వాత తమకు నచ్చిన వ్యక్తిని 11వ పంచెన్ లామా పదవికి ఎంపిక చేసింది చైనా. దీన్ని దలైలామా అంగీకరించలేదు.

ఇప్పుడు టిబెటన్ బుద్ధిజంలో మూడో అతిపెద్ద పదవికి ఎనిమిదేళ్ల బాలున్ని ఎంపిక చేయడం చర్చనీయాంశమైంది. ఇతడే దలైలామా వారసుడు అవుతాడా అన్న చర్చ కూడా నడుస్తోంది. అదే సమయంలో చైనా రియాక్షన్ ఎలా ఉండబోతోందన్నది కూడా కీలకంగా మారింది. ఎందుకంటే దలైలామా వారసుడి ఎంపిక విషయం తెరపైకి వచ్చినప్పుడు భారత్ పై పరోక్షంగా విమర్శలు చేసింది చైనా. దలైలామా ఎంపికలో భారత్ తలదూర్చబోదని అనుకుంటున్నామని నాలుగేళ్ల క్రితం కామెంట్ చేసింది. ఇప్పుడు అమెరికాలో పుట్టిపెరిగిన మంగోలియా బాలుడి విషయంలో చైనా ఏం చేస్తుందన్నది చర్చనీయాంశమైంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×