E-Paper
Advertisement

Dasara:- నానికి ‘ద‌స‌రా’ ఛాలెంజ్..!

Dasara:- నానికి ‘ద‌స‌రా’ ఛాలెంజ్..!

Dasara:- నేచుర‌ల్ స్టార్ నాని ఎంతో ప్యాష‌న్‌తో రిస్క్ తీసుకుని మ‌రీ న‌టించిన చిత్రం ‘ద‌స‌రా’. ఈ మూవీపై ఆయ‌న ఎన్నో ఆశ‌ల‌ను పెట్టుకున్నారు. అందుకు కార‌ణం..ద‌స‌రా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా హిట్ అయితే నానికి హీరోగా క్రేజ్‌, రేంజ్ పెరిగిన‌ట్లే. నెక్ట్స్ నుంచి ఆయ‌న సినిమాల‌కు సంబంధించిన లెక్క‌ల‌న్నీ ఆటోమేటిక్‌గా మారిపోతాయ‌న‌టంలో సందేహ‌మే లేదు. నాని ఎంతో క‌ష్ట‌ప‌డి రొటీన్‌కి భిన్నంగా రా అడ్ ర‌స్టిక్‌గా న‌టించిన ఈ చిత్రం ఇప్పుడు నానికి ఓ చాలెంజ్ విసురుతుంది. ఇంత‌కీ ఏంటా చాలెంజ్ అని అనుకుంటున్నారా? థియేట్రిక‌ల్ హ‌క్కుల విష‌యంలో ‘ద‌స‌రా’ మూవీ నానికి పెద్ద టార్గెట్‌నే ఫిక్స్ చేసింది. అదెలాగంటారనే వివ‌రాల్లోకి వెళితే..

ఇప్ప‌టి వ‌ర‌కు నాని సినిమాల్లో మాగ్జిమంగా రూ.35 కోట్లు థియేట్రిక‌ల్ బిజినెస్‌గా జ‌రిగింది. ఆ రికార్డ్‌ను ‘ద‌స‌రా’ దాటేసింది. ఐదు భాష‌ల్లో క లిసి ద‌సరా సినిమా రూ.50 కోట్లు థియేట్రిక‌ల్ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ద‌స‌రా హిట్ కావాలంటే రూ.51 కోట్లను వ‌సూలు చేయాలి. మ‌రి సినిమా ఆ మేర‌కు క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకుంటుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగితే స‌రిపోతుంది.

ద‌స‌రా థియేట్రిక‌ల్ బిజినెస్ వివ‌రాలు…
……………………….

నైజాం – రూ.13.7 కోట్లు.. సీడెడ్ – రూ. 6.5 కోట్లు.. ఉత్త‌రాంధ్ర – రూ.3.9 కోట్లు..ఈస్ట్ – రూ.2.35 కోట్లు..వెస్ట్ – రూ. 2 కోట్లు.. గుంటూరు – రూ. 3 కోట్లు.. కృష్ణా – రూ. 2 కోట్లు.. నెల్లూరు – రూ.1.2 కోట్లు.. రెండు తెలుగు రాష్ట్రాలు – రూ. 34.65 కోట్లు.. క‌ర్ణాట‌క – రూ. 2.85 కోట్లు.. త‌మిళనాటు, కేర‌ళ – రూ. 1.5 కోట్లు.. హిందీ – రూ. 5 కోట్లు.. ఓవ‌ర్ సీస్ – రూ. 6 కోట్లు మొత్తంగా చూస్తే రూ.50 కోట్లు థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది.

తెలంగాణ‌లోని గోదావ‌రి ఖ‌ని స‌మీపంలో ఉండే విలేజ్ బ్యాక్‌డ్రాప్ క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు చెరుకూరి సుధాక‌ర్ నిర్మాత‌.

‘ఆలీ రెజా’తో రొమాన్స్.. మళ్లీ మళ్లీ చేస్తానంటున్న ‘సనా బేగమ్’..

for more updates follow this link:-Bigtv

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×