
Natural Star Nani : నేచురల్ స్టార్ నాని.. ఇప్పటి వరకూ నటించిన సినిమాలు దాదాపు సక్సెస్ అయ్యాయి. అక్కడక్కడా ఫ్లాప్ లు వచ్చినా నానికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తనదైన స్టైల్ లో విభిన్న జోనర్స్ లో సినిమాలు చేస్తూ.. ప్రేక్షకాదరణ పొందుతున్న నాని.. దసరా సినిమాతో తన అభిమానుల్ని కాస్త నిరాశ పరిచినా.. “హాయ్ నాన్న” అంటూ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. నాని తాజాగా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఎలక్షన్ సీజన్ కావడంతో.. ఇందులో మనం ఎందుకు జాయిన్ అవ్వకూడదంటూ నాని పొలిటీషియన్ గెటప్ లో ఉన్న పోస్ట్ పెట్టాడు. డిసెంబర్ 7న మీ ప్రేమను మాకు ఇవ్వాలి.. మీ ఓటు మాకే వేయాలి.. ఇట్లు మీ హాయ్ నాన్న పార్టీ ప్రెసిడెంట్ విరాజ్ అని క్యాప్షన్ రాశారు. అంతేకాదు.. ఇలాంటి సరదా ప్రచారాలు చాలా చేస్తానని పేర్కొన్నారు. నానిని ఇలా చూసిన ఫ్యాన్స్.. ఈ గెటప్ లో చాలా బాగున్నారు.. సినిమా ప్రమోషన్స్ వినూత్నంగా చేయడంలో మీకు మీరే సాటి అంటూ తెగ పొగిడేస్తున్నారు.
హాయ్ నాన్న సినిమా విషయానికొస్తే.. ఇప్పటివరకూ వచ్చిన టీజర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శౌర్యువ్ అనే వ్యక్తి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాయి. నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా.. శృతిహాసన్ కీలకపాత్ర పోషిస్తోంది. నవంబర్ 18 నుంచే సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
https://www.instagram.com/p/Czv3iCbx4iu/