BigTV English

Tollywood Hero : సామాన్యుడిలా శబరిమలకు స్టార్ హీరో.. స్టార్లలో ఈ స్టార్ వేరయా..

Tollywood Hero : సామాన్యుడిలా శబరిమలకు స్టార్ హీరో.. స్టార్లలో ఈ స్టార్ వేరయా..

Tollywood Hero : సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పబ్లిక్ లో ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. అందుకే ఎక్కడికైనా ఆలయాలు సందర్శిస్తున్నారంటే పబ్లిక్ లో ఇబ్బందులు పడకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక సెలెబ్రేటీలు కూడా అధికారుల రూల్స్ ప్రకారం దైవ దర్శనం చేసుకుంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు కదూ.. అందుకు ఒక కారణం ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో సామాన్యుడిలా అయ్యప్ప దర్శనం కోసం ఆలయంకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరో ఎవరో కాదు న్యాచురల్ స్టార్ హీరో నాని..


హీరో నాని అయ్యప్ప మాలను ధరించిన విషయం తెలిసిందే.. మండల దీక్ష పూర్తవ్వడంతో ఆయన అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. న్యాచురల్ స్టార్ నానికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువే.. ఆయన అయ్యప్ప భక్తుడని సమాచారం. కాగా నాని అయ్యప్ప మాల ధరించారు. ఇక దీక్ష పూర్తి చేయడం కోసం శబరిమల వెళ్లారు. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు.. అనంతరం భక్తులు ఆయనను గుర్తు పట్టారు. అలాగే శబరిమలలో చేయాల్సిన పూజలను నాని పూర్తి చేశాడు. నాని శబరిమల దర్శనానికి వెళ్లిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూసిన నాని ఫ్యాన్స్ న్యాచురల్ స్టార్ అంతే ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా నానితో ఉన్నారు. ఆయన కూడా ఫోటోలకు పోజిచ్చారు. తొలిప్రేమ ఫేమ్ నటి వాసుకి భర్తనే ఈ ఆనంద్ సాయి. ఇక దీక్ష ముగిసిన అనంతరం నాని సినిమా షూటింగ్స్ లో బిజీ కానున్నారు..


ఇక నాని సినిమాల సినిమాల విషయానికొస్తే.. శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 మూవీ చేస్తున్నారు. శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ లో వస్తున్న మూడవ చిత్రం ఇది. పార్ట్ వన్ లో విశ్వక్ సేన్, పార్ట్ 2 లో అడివి శేష్ నటించారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ సినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో నాని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబందించిన పోలీస్ ఆఫీసర్ గా కనిపించునున్నాడు. ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలై భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. నాని క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. నాని ఓ హిట్ ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.  శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది మేడే సందర్బంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత దసరాతో సూపర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల, నాని మరో సినిమా చేస్తున్నారు. దీనికి ది ప్యారడైజ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కాగా నాని ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ఈ ఏడాది హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ రెండు సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×