Chanagani Dayakar: కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా తెలంగాణకు ఉపయోగం ఉందా..? అంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ విమర్శించారు. ప్రజా పాలన గురించి బీజేపీ నాయకులు మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా తెలంగాణ ఏమి జరిగిందో చెప్పాలి అంటూ ఫైర్ అయ్యారు. ప్రజా పాలనపై కాదు బీజేపీ మంత్రుల పైన చార్జిషీట్ వేసుకోవాలి అంటూ దయాకర్ ఘాటు విమర్శలు చేశారు. పది ఏళ్లు పాలించిన BRS నేతల అవినీతిని ఏనాడు అయినా ప్రశ్నించారా.. అని ఫైర్ అయ్యారు.
కెసీఆర్ లక్ష కోట్ల అవినీతి చేసినా బీజేపీ పట్టించుకోదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా 2019 నుండి ఒక్క జాతీయ విద్య సంస్థ తీసుకువచ్చాడా.. అని ప్రశ్నించారు. తెలంగాణకు దిష్టి బొమ్మలు లాగా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారని సైటైరికల్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ అరెస్ట్ కాకుండా కాపాడుతుంది కిషన్ రెడ్డి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, BRS పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందంటూ ఫైర్ అయ్యారు. ప్రజా పాలనలో, ఏడాదిలో 53000 ఉద్యోగాల భర్తీ జరిగింది. 3,13,897 మంది రైతు కుటుంబాలకు రుణ మాఫీ చేస్తూ అందుకు అవసరమైన 2747.67 మేలు జరిగిందన్నారు.
Also Read: హరీష్‌రావు మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు, ఆపై కేసు.. రేపో మాపో నోటీసులు?
మోదీ చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. Ed, సీబీఐ లను బీజేపీ చెప్పు చేతులలో పెట్టుకుందని ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో IIM 2015లో ఏర్పాటు చేశారు.. మరి కేంద్ర మంత్రిగా ఉండి.. తెలంగాణకు IIM ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీ తెలంగాణ రాష్టంపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేయక పోతే కిషన్ రెడ్డి అడ్డుకుంటాం అని హెచ్చరించారు. ప్రజా పాలన వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని.. తెలంగాణలో చేపట్టిన పథకాలు దేశానికి ఆదర్శం అన్నారు.