BigTV English

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ పవర్ ప్యాక్డ్ మేకింగ్ వీడియో.. అదిరిపోయిందిగా

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ పవర్ ప్యాక్డ్ మేకింగ్ వీడియో.. అదిరిపోయిందిగా

Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్నాడు. గతేడాది ఏకంగా ఇద్దరు కొత్త దర్శకులతో రెండు సినిమాలు తీసి సూపర్ హిట్లు కొట్టాడు. శ్రీకాంత్ ఓదెలాతో దసరా సినిమా తీసి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. ఈ మూవీలో మాస్ యాక్షన్‌ లుక్‌లో కనిపించి అదరగొట్టేశాడు. ఆ తర్వాత మరో కొత్త దర్శకుడు శౌర్యువ్‌తో ‘హాయ్ నాన్న’ సినిమా తీసి మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో తండ్రి కూతుళ్ల ప్రేమ ఎంతో మంది ఆడియన్స్‌ను కంటతడి పెట్టించింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.


అయితే వీటి కంటే ముందు నాని ఓ కొత్త దర్శకుడితో చేసిన ఓ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. అదే ‘అంటే సుందరానికి’ మూవీ. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. అయితే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని దర్శకుడు వివేక్ ఆత్రేయ నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే నేచురల్ స్టార్ నానితో మరో సినిమా తీసి హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఇక నాని కూడా వివేక్ ఆత్రేయకు మరో అవకాశం ఇచ్చాడు.

Also Read: నాని యాక్టింగ్ ఇరగదీసేశాడు.. వీడియో అదిరిపోయిందంతే..


ఇప్పుడు నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘సరిపోదా శనివారం’. భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌కు సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చాయి. ఇందులో నాని చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. నానికి జోడీగా మరోసారి ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా జోడీ కట్టింది. వీరిద్దరు కలిసిన ఇదివరకు నటించిన సినిమా ‘గ్యాంగ్ లీడర్’. ఇప్పుడు మళ్లీ సరిపోదా శనివారం మూవీతో జోడీ కట్టారు.

కాగా ఈ సినిమాను ఈ నెల అంటే ఆగస్టు 29న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ మరికొన్ని అప్డేట్‌లు వదులుతూ అంచనాలు పెంచేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇటీవలే ఎస్ జే సూర్య పాత్రను రిలీజ్ చేస్తూ ఓ గ్లింప్స్ వదిలారు. అందులో అతడి రోల్ చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఇప్పుడు మేకర్స్ మరో సర్‌ప్రైస్ అందించారు. తాజాగా ఈ మూవీ నుంచి మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే పవర్ ప్యాక్డ్‌గా అనిపిస్తుంది.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×