BigTV English

Telangana Cm: విద్యార్థినికి అండగా సీఎం, ప్రభుత్వ ఖర్చుతో నిమ్స్‌లో వైద్యం

Telangana Cm: విద్యార్థినికి అండగా సీఎం, ప్రభుత్వ ఖర్చుతో నిమ్స్‌లో వైద్యం

Medical Treatment In Nims At The Expense Of Govt: తెలంగాణ గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీకకు మానవతాదృక్ఫథంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. విద్యార్థిని కోలుకునేంతవరకు ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని ఆయన సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు. సీఎం సూచన మేరకు హైదరాబాద్ లోని నిమ్స్ లో కార్తీకకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కార్తీక కోలుకుంటోంది.


ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక.ఈనెల 9న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి పడిపోయింది. దీంతో విద్యార్థిని నడుము భాగంలో తీవ్రగాయాలయ్యాయి. గురుకుల అధికారులు కార్తీకను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి,అక్కడి నుంచి నిమ్స్ కు తరలించారు. నిమ్స్ న్యూరో సర్జన్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ బృందం మంగళవారం నాడు కార్తీకకు ఆపరేషన్ నిర్వహించింది. ప్రస్తుతం ఐసీయులో విద్యార్థిని కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. కార్తీకకు కావాల్సిన వైద్యం ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించనున్నది.

Also Read: కనువిందు చేయనున్న 40 ఫీట్ల మట్టి గణపతి, ఫస్ట్‌ టైం ఓరుగల్లులో..!


ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ వేముల శ్రీనివాస్ లు నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో మాట్లాడి కార్తీక కోలుకునేంత వరకు వైద్యం అందించాలని సూచించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా కార్తీక ఆరోగ్య పరిస్థితిపైన ఎప్పటికప్పుడు నిమ్స్ డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ విషయంపై స్పందించిన సీఎంకి విద్యార్థిని తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×