E-Paper
Advertisement

Natural star NewYear treat : నేచుర‌ల్ స్టార్ న్యూ ఇయ‌ర్ ట్రీట్‌

Natural star NewYear treat : నేచుర‌ల్ స్టార్ న్యూ ఇయ‌ర్ ట్రీట్‌
Advertisement

Natural star NewYear treat : మ‌న ప‌క్కింటి కుర్రాడిలా క‌నిపిస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించట‌మే కాదండోయ్‌.. మాస్ జ‌నాల్లోనూ ఇమేజ్ సంపాదించుకున్న హీరోల్లో నేచుర‌ల్ స్టార్ నాని ఒక‌రు. ప్ర‌స్తుతం ఈయ‌న ద‌స‌రా అనే సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఈ సినిమా త‌ర్వాత నాని నెక్ట్స్ మూవీ ఏం చేస్తార‌నే దానిపై కొన్ని రోజుల నుంచి ప‌లు ర‌కాల వార్త‌లు వినిపిస్తూ వ‌చ్చాయి. అయితే తాజాగా నాని కొత్త సినిమా అనౌన్స్మెంట్ డేట్ వ‌చ్చేసింది. కొత్త సంవ‌త్స‌రం రోజున‌.. అంటే జ‌న‌వరి 1 2023లో నాని కొత్త సినిమా ప్ర‌క‌ట‌న వ‌చ్చేస్తుంది.

వైరా ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.వి.మోహ‌న్‌, డాక్ట‌ర్ విజేందర్ రెడ్డి తీగ‌ల‌, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ద‌ర్శ‌కులు, ఇత‌ర టెక్నీషియ‌న్స్ వివరాల‌ను న్యూ ఇయ‌ర్ రోజునే ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు. సి.వి.మోహ‌న్ ఎవ‌రో కాదు.. ఇంత‌కు ముందు మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో ఒక నిర్మాత‌గా ఉండేవారు. అక్క‌డ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసి కొత్త నిర్మాణ సంస్థ‌ను స్టార్ట్ చేశార‌నేది టాక్‌. ఈ సినిమాను శౌర్య అనే డెబ్యూ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించ‌బోతున్నారు. ఇది నాని నటిస్తోన్న 30వ చిత్రం.

Advertisement

ప్ర‌స్తుతం నాని పాన్ ఇండియా మూవీ ద‌స‌రా.. మార్చి 30న రిలీజ్ కానుంది. మూవీ ఫైన‌ల్ స్టేజ్ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ ఏడాది నానికి హీరోగా కలిసి రాలేదు కానీ.. నిర్మాతగా కలిసొచ్చింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×