BigTV English

Revanthreddy : కేసీఆర్ కు రేవంత్ లేఖ.. ఆ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..

Revanthreddy : కేసీఆర్ కు రేవంత్ లేఖ.. ఆ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..

Revanthreddy : రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖాస్త్రాన్ని సంధించారు. పండించిన పంటలకు మద్దతు ధర దక్కకుండా దళారులు రైతులను మోసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు సమస్యలను ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు.


బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజు ఇద్దరు అన్నదాతలు బలవన్మరణానికి పాలపడుతున్నారని తెలిపారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని జాతీయ క్రైం బ్యూరో లెక్కలు చెబుతున్నాయని వివరించారు. ఈ నివేదిక ప్రకారం 2014 నుంచి 2022 వరకు రాష్ట్రవ్యాప్తంగా 7,069 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో నవంబర్ వరకు రాష్ట్రంలో 512 మంది రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని రేవంత్‌ తెలిపారు. ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 80 శాతం కౌలు రైతులే ఉన్నారని లేఖలో వివరించారు. ప్రభుత్వం మాత్రం కౌలు రైతుల కోసం ఏమి చేయడం లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి డిమాండ్లు ఇవే..


  1. పత్తికి క్వింటాలుకు రూ.15 వేలు చెల్లించాలి.
  2. రైతులకు తక్షణమే రూ. లక్ష రుణమాఫీ అమలు చేయాలి.
  3. ఆత్మహత్యలకు పాల్పపడ్డ రైతు కుటుంబాల ప్రైవేట్ అప్పులను వన్ టైం సెటిల్మెంట్ కింద పరిష్కరించేందుకు ప్రభుత్వ వ్యవస్థలు చొరవ తీసుకోవాలి.
  4. కౌలు రైతులకు కూడా రైతులకు వర్తించే అన్ని పథకాలు అమలు చేయాలి.
  5. పంటల బీమా పథకం అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలి.

రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు కావడంలేదని ఫలితంగా రైతులకు నష్టపరిహారం కూడా అందడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల నివారణపై దృష్టి సారించాలని సూచించారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని కోరారు. కాంగ్రెస్ పక్షాన ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిన డిమాండ్లపై తక్షణం స్పందించాలని లేకుంటే రైతుల తరపున క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×