BigTV English

OTT Movie : రివ్యూ ఇస్తే చంపేసే సైకో… దుల్కర్ సల్మాన్ మోస్ట్ వయొలెంట్ మూవీ

OTT Movie : రివ్యూ ఇస్తే చంపేసే సైకో… దుల్కర్ సల్మాన్ మోస్ట్ వయొలెంట్ మూవీ

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు థియేటర్లతో పాటు, ఓటీటీలో కూడా అదరగొడుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో దుల్కర్ సల్మాన్ సీరియల్ కిల్లర్ పాత్రలో మెప్పించాడు. ఈ మూవీ చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


జీ 5 (Zee 5) లో

ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘చుప్ : రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ (Chup : Revenge of the Artist). 2022 లో వచ్చిన ఈ మూవీకి ఆర్. బాల్కీ దర్శకత్వం వహించారు. ఇందులో సన్నీ డియోల్, దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వంతరి, పూజా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. సినిమా విమర్శకులపై దాడి చేసే ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ జీ 5 (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ముంబై నగరంలో నితిన్ శ్రీవాత్సవ్ అనే ఒక ప్రముఖ సినీ విమర్శకుడు, తన ఇంట్లో దారుణంగా హత్యకు గురవుతాడు. ఈ కేసును ఛేదించేందుకు క్రైమ్ బ్రాంచ్ హెడ్ ఐజీ అరవింద్ మాథుర్ ను నియమిస్తారు. హంతకుడు శ్రీవాత్సవ్ శరీరంపై సర్జికల్ కత్తితో గాయాలు చేసి, నుదుటిపై ఒక స్టార్ రేటింగ్‌ను గీస్తాడు. ఇది అరవింద్‌ కు అర్థం కాని సంకేతంగా ఉంటుంది.

మరి కొద్ది రోజుల్లోనే, మరో సినీ విమర్శకుడు ఇర్షాద్ అలీ కూడా రైలు పట్టాల మీద హత్యకు గురవుతాడు. ఈ హత్యలు సినిమాలకు తక్కువ రేటింగ్‌ లు ఇచ్చే విమర్శకులపై జరుగుతున్నట్లు అరవింద్ గుర్తిస్తాడు. ఈ సమయంలో డానీ అనే ఫ్లోరిస్ట్‌ కు, నీలా మీనన్ అనే ఎంటర్‌టైన్‌మెంట్ రిపోర్టర్‌ తో ప్రేమాయణం మొదలవుతుంది. నీలా సినిమా విమర్శకురాలిగా మారాలని కలలు కంటూ ఉంటుంది. మరోవైపు హంతకుడు నిజాయితీగా రివ్యూలు ఇవ్వని వారిని శిక్షిస్తున్నట్లు పోలీసులకు తెలుస్తుంది.

ఈ క్రమంలో పోలీసులు ఒక క్యాసెట్‌ ను కనిపెడతారు. అది డానీకి సంబంధించింది. అతని మీద పోలీసులకి అనుమానం వస్తుంది. నిజానికి డానీ నిజమైన పేరు సెబాస్టియన్ గోమ్స్. అతను బాల్యంలో గురు దత్ సినిమాలను బాగా అభిమానిస్తుంటాడు. సెబాస్టియన్ తండ్రి తన తల్లిని, అతని కుక్క డానీని చంపడంతో అతని జీవితం విషాదంగా మారుతుంది.

పెద్దయ్యాక సెబాస్టియన్ ‘చుప్’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తాడు. కానీ విమర్శకులు దానిని తీవ్రంగా విమర్శిస్తారు. ఈ విమర్శలు అతన్ని మానసికంగా కుంగదీస్తాయి. ఆ తరువాత అతను డానీగా మారి, సినిమాలకు చెడు రివ్యూలు ఇచ్చే విమర్శకులను హత్య చేయడం మొదలు పెడతాడు. చివరికి సెబాస్టియన్ ను పోలీసులు పట్టుకుంటారా ? అతని లవ్ స్టోరీ ఏమౌతుంది ? ఇంకా ఎంతమందిని సెబాస్టియన్ చంపుతాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : ఫోన్ రిపేర్ కి ఇచ్చి సైకో గాడి చేతికి అడ్డంగా దొరికిపోయే అమ్మాయి… మెంటలెక్కించే క్రేజీ కొరియన్ థ్రిల్లర్

Tags

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×