BigTV English

Sakshi Sivanand : చిరంజీవి హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..? అస్సలు నమ్మలేరు..

Sakshi Sivanand : చిరంజీవి హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..? అస్సలు నమ్మలేరు..

Sakshi Sivanand :  ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేర్ చేస్తున్న హీరోయిన్లు ఇప్పుడు సినిమాలకి దూరమైపోయారు. కొందరేమో అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైతే.. మరికొందరేమో కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలా చాలా మంది ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ హీరోయిన్ సాక్షి శివానంద్ ఒకరు.. ఒకప్పుడు చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది..? ఎక్కడ ఉందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


సాక్షి శివానంద్ సినిమాలు..

తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు.. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రమే అప్పటినుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు. ఎంతోమంది హీరోయిన్లు ఎప్పుడు వచ్చామో ఎప్పుడు వెళ్ళాము అని కూడా చెప్పకుండానే సైలెంట్ గా సైడ్ అయిపోయారు. అలా కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీ నుంచి మాయమయ్యారు. అందులో చిరంజీవి మాస్టర్ హీరోయిన్ సాక్షి శివానంద్ కూడా ఉంది. ఈ అమ్మడు తన అందంతో, వయ్యారంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ భామ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దిరోజులకి బిజీ హీరోయిన్ అయిపోయింది. చిరంజీవితోనే కొన్ని సినిమాలు కూడా చేసింది. అలా ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.


Also Read :త్రివిక్రమ్ డైరెక్టర్ కాకముందు అలాంటి పనులు చేశాడా..?

ఇప్పుడు ఏం చేస్తుంది..? 

1977 ఏప్రిల్ 15న ముంబైలో జన్మించిన సాక్షి శివానంద్ 1995లో జనం కుండ్లి సినిమాతో బాలీవుడ్ లోకి మొట్టమొదటిసారి అడుగుపెట్టింది. ఆ తరువాత తెలుగులో సినిమా అవకాశాలు రావడంతో ఇక్కడ మంచి పేరు సంపాదించుకుంది.. చిరంజీవితో మాస్టర్ సినిమాని చేసింది. ఆ తర్వాత నాగార్జున, మహేష్ బాబు, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు అందరితో పని చేసింది. తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది సాక్షి శివానంద్.ఆ తరువాత 2008లో జగపతిబాబు నటించిన హోమం సినిమాలో ఐటమ్ సాంగ్ లో స్టెప్పులేసింది. ఈ అమ్మడు తెలుగులో చివరిగా శ్రీకాంత్ నటించిన రంగానికి దొంగ సినిమాలో కనిపించింది ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఈమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరు షాక్ అవుతున్నారు. ఇటీవల ఒక్కొక్క హీరోయిన్ ను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బిజీగా మారుతుంది. మరి ఈమె కూడా మళ్లీ సినిమాలోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.. ఏది ఏమైనా కూడా అప్పట్లో ఉన్న హీరోయిన్ ఇప్పుడు అలా లేదని సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను చూసిన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు..

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×