BigTV English

Suriya 44 Movie Update: అప్పుడే మరో సినిమాను లైన్లో పెట్టిన సూర్య.. పోస్టర్ అదుర్స్!

Suriya 44 Movie Update: అప్పుడే మరో సినిమాను లైన్లో పెట్టిన సూర్య.. పోస్టర్ అదుర్స్!
Suriya 44
Suriya 44

Update on Suriya 44: కోలీవుడ్ స్టార్ హీరో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో ఎన్నో చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. అయితే ఇప్పటికే పలు సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ హీరో.. తాజాగా మరో సినిమాను లైన్‌‌లో పెట్టాడు. అయితే ఆ మూవీ ఏంటో.. డైరెక్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సూర్య ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీలనే ఎంచుకుంటాడు. అంతేకాదండోయ్ డిఫరెంట్ పాత్రలు చేయడంలో కూడా ముందుంటాడు.

అయితే అలాంటి డిఫరెంట్ కథతోనే ఇప్పుడు ‘కంగువ’ సినిమా చేస్తున్నాడు. పీరియాడికల్ స్టోరీతో ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సిని ప్రియుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా టీజర్‌లో చూస్తే.. సూర్య తనలోని మరో కొత్త కోణాన్ని పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.


Also Read: విశ్వక్‌సేన్‌ బర్త్‌ డే స్పెషల్‌.. ఈ రోజు రాబోతున్న కొత్త సినిమా అప్డేట్లు ఇవే..

అంతేకాకుండా ఇందులోని యాక్షన్ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. కాగా ఇందులో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే జగపతి బాబు, బాబీ డియోల్, యోగిబాబు వంటి నటులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ మూవీ దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అయితే పాన్‌ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి.. దాదాపు రూ.1000 కోట్లు కలెక్షన్స్ రాబట్టాలనే టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ తర్వాత సూర్య మరో చిత్రానికి కూడా ఇదివరకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

‘ఆకాశం నీ హద్దురా’ ఫేం సుధా కొంగరతో ‘సూర్య43’ మూవీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. కంగువ మూవీ కంప్లీట్ అయిపోగానే ఈ మూవీని పట్టాలెక్కించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ లైన్‌లో ఉండగానే సూర్య మరో చిత్రానికి కమిట్ అయ్యాడు.

Also Read: ‘టిల్లు స్క్వేర్’ ట్విట్టర్ రివ్యూ.. 3/5 రేటింగ్.. కానీ అదొక్కటే

తన కెరీర్‌లో 44వ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో ఓ ప్రాజెక్ట్‌కు సైన్ చేశాడు. తాజాగా ఈ కాంబోకి సంబంధించిన అప్డేట్‌ను సూర్య, దర్శకుడు కార్తీక్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో ‘సూర్య 44’ అని ఓ చెట్టుపై రాసి ఉండగా.. ఆ టైటిల్ వెనుక బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఎర్రటి మంటలతో కనిపించి ఆసక్తిని రేపుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సినీ ప్రియులు, అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతుంది.

Tags

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×