BigTV English

Viral : ట్రెండింగ్ పిక్.. నోట్లకుప్పలపై నిద్రిస్తున్న పొలిటీషియన్!

Viral : ట్రెండింగ్ పిక్.. నోట్లకుప్పలపై నిద్రిస్తున్న పొలిటీషియన్!
Viral
Viral

Viral : సాధారణంగా సీబీఐ, ఈడీ, ఏసీబీ అధికారులు అక్రమాలకు పాల్పడి డబ్బును సంపాదిస్తే అటుంటి వారిపై దాడులు నిర్వహిస్తారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకుంటారు. ఈ దాడుల్లో డబ్బులు గుట్టలుగుట్టలుగా దొరుకుతాయి. ఇంట్లో సీక్రెట్ ప్లేసుల్లో, లాకర్లలో ఎక్కడబడితే అక్కడా అవినీతి సొమ్ము పట్టుబడుతుంది.


మరి కొందరు అవినీతి పరులైతే.. బ్యాంక్ లాకర్‌లలో, గార్డెన్‌లో, భూమిలో ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి డబ్బును దాస్తుంటారు. ముఖ్యంగా కొందరు ప్రభుత్వ అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ఈ విధంగా అక్రమంగా సంపాదించిన సొమ్ము కుప్పలు కుప్పలుగా ఉంటుంది. ఇటువంటి ఘటనలు అనేకం జరిగాయి.

Also Read :  రోడ్డుపై బైక్ నడుపుతూ ఆఫీసు జూమ్ మీటింగ్ కాల్.. ‘మా సాఫ్ట్‌వేర్ కష్టాలు మీకేం తెలుసు భయ్యా’!


అనంతరం ఏసీబీ అధికారులు ఆ సొమ్మును స్వాధీనం చేసుకొని సీజ్ చేసి ఏసీబీ కోర్టులో వారిని హజరు పరుస్తుంటారు. అవినీతి పరులంతా ఆదాయపన్నుశాఖకు సరైన లెక్కలు చూపించకుండా డబ్బులను ఇలా అడ్డదారుల్లో దాస్తుంటారు. ప్రస్తుతం ఇటుంటి ఘటనే ఒకటే వెలుగు చూసింది. అస్సాంకు చెందిన ఓ పొలిటీషియన్ నోట్ల మంచంపై నిద్రపోతున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఉదల్‌గిరి జిల్లాలోని భైరగురిలో విలేజ్ కౌన్సిల్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ బెంజమిన్ బసుమతరీ రూ.500 నోట్ల కట్లను మంచంపై పరుచుకొని హాయిగా నిద్రిస్తున్నాడు. అతని బాడీపై కూడా ఎన్నో నోట్ల కట్టలు కుప్పలుగా పడున్నాయి.

ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ప్రకారం.. ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకం, గ్రామీణ ఉద్యోగాల పథకం ద్వారా బోడోలాండ్ నాయకుడు అవినీతికి పాల్పడ్డాడు. ఈ కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు. నిందితుడు ఒడల్‌గూరి డెవలప్‌మెంట్ జోన్‌లోని తన పరిధిలో పీఎంఏవై, ఎంఎన్‌ఆర్‌, ఈజీఏ పథకాల పేర్ల మీద పేద ప్రజల నుంచి అతడు భారీగా లంచాలు వసూల్ చేశాడని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అతడిని జనవరి 10, 2024న పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ప్రమోద్ బోరో, UPPL చీఫ్ తెలిపాడు. బసుమత్రికి ఇకపై UPPLతో సంబంధం లేదని స్పష్టం చేశాడు. అంతేకాకుండా హరిసింగ బ్లాక్ కమిటీ, UPPL నుండి 5 జనవరి, 2024న లేఖ అందించామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Related News

Viral Video: గుడ్డుపై 150మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు.. ఈ వండర్ ఫోటోను ఇప్పుడే చూసేయండి బ్రో!

ఇది రియల్లీ మైండ్ బ్లోయింగ్ వీడియా.. తాళాన్ని క్షణాల్లో ఓపెన్ చేశాడు.. ఇక దొంగలకు తెలిస్తే..?

Drunken Trump: ఫుల్‌గా మందుకొట్టి.. పుతిన్ ముందుకు.. ట్రంప్ మామ దొరికిపోయాడు, ఎలా తడబడ్డాడో చూడండి

Mumbai Hotel: ముంబై హోటల్‌లో కప్పు టీ అక్షరాల రూ.1000.. ఈ ఎన్ఆర్ఐ రియాక్షన్ చూడండి, వీడియో వైరల్

Leopard Attack: సఫారీ రైడ్‌లో బాలుడిపై చిరుత అటాక్.. పరిగెత్తుకుంటూ వచ్చి మరీ.. వీడియో వైరల్

Viral Video: ఈ రెస్టారెంట్‌ లో గాల్లో ఎగురుతూ వడ్డిస్తారు.. భలే ఉందే!

Big Stories

×