Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి హీరోగా ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. డి ఫర్ దోపిడీ, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనంతరం నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
సంక్రాంతి రేసులో..
నవీన్ పోలిశెట్టి హీరోగా, డైరెక్టర్ మారి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం “అనగనగా ఒక రాజు”. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవరనాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే సినిమా నుంచి పోస్టర్ విడుదల చేస్తూ ఈ సంక్రాంతికి దద్దరిల్లే నవ్వులని ఆనందాన్ని తీసుకొస్తున్నామంటూ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. అయితే సంక్రాంతి బరిలో ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నప్పటికీ స్టార్ హీరోల సినిమాలకు పోటీగా నవీన్ పోలిశెట్టి కూడా సంక్రాంతి బరిలోనే దిగబోతున్నారు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్నారు.
సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ అని చెప్పాలి. సంక్రాంతి పండుగ బరిలో చిన్న హీరోల నుంచి మొదలుకొని పెద్ద హీరోల వరకు పోటీ పడుతూ సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోలైన బాలకృష్ణ చిరంజీవి వంటి హీరోలు కూడా తమ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న అఖండ 2 సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనుంది.
చిరంజీవి, అనిల్ రావిపూడి..
ఇకపోతే ఈ సినిమాతో పాటు మరొక స్టార్ హీరో అయిన చిరంజీవి సైతం సంక్రాంతి పండుగకు కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్నటువంటి సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి డైరెక్షన్లో బిజీ కాబోతున్నారు.ఇలా స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నప్పటికీ స్టార్ హీరోలకి పోటీ ఇస్తూ నవీన్ పోలిశెట్టి సినిమాని కూడా నిర్మాతలు సంక్రాంతి బరిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.