Viva Harsha : యూట్యూబ్ ద్వారా ఏవో వీడియోలు చేసుకుంటూ క్రేజ్ ని సంపాదించుకున్న చాలామంది ఇప్పుడు సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ కమెడియన్లుగా హీరోలుగా రాణిస్తున్నారు.. అలాంటి వారిలో టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష ఒకరు.. ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయిన ఈ నటుడు ఇప్పుడు సినిమాల్లో పలు క్యారెక్టర్లలో నటించడమే కాకుండా హీరోగా కూడా సినిమాల్లో నటించారు. ఇప్పుడు వరకు హర్ష సపోర్టింగ్ రోల్ లో కనిపించాడు. మొన్నమధ్య రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు కానీ ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ టాక్ని సొంతం చేసుకోలేదు.. దాంతో ఇప్పుడు మళ్లీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నాడు.. హర్ష తాజాగా ఖరీదైన కారుని కొనుగోలు చేసి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇంతకీ ఆయన కొన్న కారు ఎన్ని కోట్లు ఒకసారి తెలుసుకుందాం..
కోట్లు ఖరీదైన కారును కొన్న హర్ష..
ఈమధ్య వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నా వైవా హర్ష గ్యారేజ్ లోకి కొత్త కారు వచ్చి చేరింది. ఆ కారు ఖరీదు కోట్లల్లో అన్న మాటే. సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు చేసుకునే ఓ క్రేజీ నటుడు కోట్లు ఖరీదు చేసే కారు కొనడం గమనార్హం.. హర్ష వీలుచిక్కినప్పుడల్లా స్పోర్ట్స్ బైక్స్ వేసుకుని ఫ్రెండ్స్ తో కలిసి లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్తుంటాడు. ఆ బైక్స్ అన్నీ కూడా రూ.20 లక్షలు, రూ.30 లక్షలు విలువ చేసేవే. ఇప్పుడు వాటికి తోడు బీఎండబ్ల్యూ ఎఫ్87 ఎమ్2 కాంపిటీషన్ కారు కొనుగోలు చేశాడు.. ఈ కారు ధర అక్షరాల కోటికి పైగానే ఉంటుంది. కోటి 30 లక్షల నుంచి రూ.కోటి 40 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే సినిమాలు చేస్తూ సంపాదిస్తున్న హర్ష.. వాటిని కార్స్, బైక్స్ కొనడానికే ఎక్కువగా ఉపయోగిస్తున్నాడని ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్..
Also Read :అదే నేను చేసిన బ్లండర్ మిస్టేక్.. రిస్క్ చేసి మోసపోయాను..
సినిమాల విషయానికొస్తే..
ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో పనిచేస్తూ సెలబ్రిటీల ను ఇంటర్వ్యూ చేస్తూ వచ్చిన హర్ష ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు. గత ఏడాది వచ్చిన సుందరం మాస్టర్ అనే సినిమాతో హీరో అయ్యాడు. ప్రస్తుతానికైతే మోగ్లీ, బకాసుర రెస్టారెంట్ అనే చిత్రాలు చేస్తున్నాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే కార్లు, బైక్స్ అంటే ఇతడికి తెగ పిచ్చి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఖరీదైన లగ్జరీ కారుని కొనుగోలు చేశాడు.. ఇకపోతే హర్ష ఈమధ్య ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 2021లో అక్షర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎప్పటికప్పుడు ఈమెతో దిగిన ఫొటోలని పోస్టూ చేస్తూ ఉంటాడు.. తాజాగా కారు కొన్న ఫోటోలను షేర్ చేశారు ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..