BigTV English

Pakistan Airplane: ఇసుక తుఫాన్ లో చిక్కుకున్న పాక్ విమానం.. ఆ తర్వాత ఏమైందంటే..?

Pakistan Airplane: ఇసుక తుఫాన్ లో చిక్కుకున్న పాక్ విమానం.. ఆ తర్వాత ఏమైందంటే..?

భారీ వర్షాలున్నా కూడా విమాన ప్రయాణాలకు పెద్దగా ఆటంకాలు ఉండవు. అదే భూమిపై వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా విమానాల ల్యాండింగ్ కష్టమైపోతుంది. సహజంగా మన దగ్గర పొగమంచు కారణంగా విమాన ప్రయాణాలు ఆలస్యం అవుతుంటాయి, పాకిస్తాన్ లో మాత్రం ఇటీవల ఓ వింతైన సంఘటన జరిగింది. ఇసుక తుఫాను ఓ విమానాన్ని చుట్టుముట్టింది. దీంతో ఆ విమానం ల్యాండ్ అయినట్టే అయి, మళ్లీ టేకాఫ్ తీసుకుంది. పైలట్ చాకచక్యంతో వ్యవహరించడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడ్డారు. లేకపోతే లాహోర్ విమానాశ్రయంలో పెను ప్రమాదం జరిగేది.


తప్పిన ప్రమాదం..

కరాచీ నుంచి లాహోర్ కు ఫ్లై జిన్నా విమానం బయలుదేరింది. మరికాసేపట్లో కరాచీలో ఆ విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అంతలోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇసుక తుఫాను కమ్మేసింది. పక్కన ఉన్న మనిషి కూడా కనపడని పరిస్థితి. ఆ తుఫాను సమయంలో విమానం కరాచీలో ల్యాండ్ అవుతోంది. విమానం చక్రాలు భూమిని తాకాయి. అంతే, ఒక్కసారిగా పెద్ద కుదుపు. అంతలోనే పైలట్ కి విమానాశ్రయం నుంచి ఆదేశాలు అందాయి. అక్కడ ల్యాండింగ్ ప్రమాదం అని హెచ్చరికలు అందాయి. అంతే, పైలట్ వెంటనే అప్రమత్తం అయ్యాడు. ఆ విమానాన్ని ల్యాండింగ్ చేయలేదు. వెంటనే టేకాఫ్ తీసుకున్నాడు. కళ్లు పొడుకున్నా ఏమీ కనపడని పరిస్థితుల్లో కేవలం అదృష్టమే ఆ విమానంలోని వారిని కాపాడింది. అక్కడే పలు రౌండ్లు చక్కర్లు కొట్టిన విమానం ఆ తర్వాత కరాచీ కి తిరుగు ప్రయాణం అయింది. కరాచీ ఎయిర్ పోర్ట్ లో లో పరిస్థితి అనుకూలంగానే ఉండటంతో అక్కడ విమానం ల్యాండ్ అయింది.


ప్రాణాలతో బయపపడ్డ ప్రయాణికులు

మరికాసేపట్లో విమానం లాహోర్ లో ల్యాండ్ అవుతుంది అనే సందేశం విన్న ప్రయాణికులు కిందకు దిగడానికి రెడీ అవుతున్నారు. అంతలోనే విమానం ల్యాండ్ కావట్లేదు, తిరిగి టేకాఫ్ తీసుకుంటుంది అని తెలిసి భయపడ్డారు. ఆ భయానికి తోడు విమానంలో పెద్ద కుదుపు వచ్చింది. కాసేపు విమానం పైలట్ కంట్రోల్ లో ఉందా లేదా అనే అనుమానం వారిని వెంటాడింది. ఇంకే ముంది, మరణం తప్పదు అని వారు డిసైడ్ అయ్యారు. అయితే అదృష్టం బాగుండి వారంతా బతికి బయటపడ్డారు. విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చివరకు కరాచీలో ఫ్లైట్ ఎక్కి, తిరిగి అక్కడే ల్యాండ్ అయ్యారు. లాహోర్ కి వెళ్లలేదన్న అసహనం వారిలో లేదు, ప్రాణాలతో బయటపడ్డామనే ఆనందం మాత్రం ఉంది.

వీడియో వైరల్..

సోషల్ మీడియాలో విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ ప్రయాణికుడు ఈ వీడియో తీశాడు. తోటి ప్రయాణికులంతా భయంతో హాహాకారాలు చేస్తున్న శబ్దాలు కూడా అందులో రికార్డ్ అయ్యాయి. విమానం లాహోర్ లో ల్యాండ్ అవుతుందని తెలిసిన తర్వాత దాదాపు 10నుంచి 12 నిమిషాల సేపు తామంతా భయంతోనే గడిపామని ప్రయాణికులు తెలిపారు. తమ జీవితంలోనే అవి అత్యంత భయానక క్షణాలు అని వారు చెబుతున్నారు. లాహోర్ తోపాటు అదే రోజు ఇస్లామాబాద్ లో కూడా వాతావరణ పరిస్థితులు సరిగా లేవు. దీంతో విమాన ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దాదాపు 22 విమానాలు ఆలస్యం అయ్యాయి, దారి మళ్లించబడ్డాయి. ఇస్లామాబాద్ విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా వరదనీరు చేరింది. వడగళ్ల వానతో ఆ ప్రాంతం దెబ్బతిన్నది. దీంతో పలు విమానాలు రద్దు చేశారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×