Naveen Polishetty : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోస్ లో నవీన్ పోలిశెట్టి ఒకరు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నేనొక్కడినే వంటి సినిమాలలో చిన్న పాత్రలలో కనిపించిన నవీన్ ఆ తర్వాత కొన్నేళ్లపాటు తెలుగు సినిమాకు దూరమైపోయారు. అయితే టాలెంట్ కు భాషతో సంబంధం లేదు అని చెప్పినట్లు, ఒక తెలుగు వాడిగా ముంబై వెళ్లి తన టాలెంట్ ఏంటో చూపించాడు. చాలా వీడియోస్ లో నవీన్ మాట్లాడే విధానం చూస్తే నవీన్ ముంబైలో పుట్టి పెరిగాడా అనే రేంజ్ లో ఉంటుంది తన స్లాంగ్. కేవలం హిందీ మాత్రమే కాకుండా హైదరాబాద్ లాంగ్వేజ్ ని కూడా అచ్చు గుద్దినట్టు చెప్పగలుగుతాడు. అనుదీప్ కేవి దర్శకత్వంలో వచ్చిన జాతి రత్నాలు సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో నవీన్ మాట్లాడిన విధానం ఆ మ్యానరిజమ్స్ అన్నీ కూడా ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. జాతి రత్నాలు సినిమా తర్వాత వచ్చిన మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసి మంచి ప్రశంసలు కూడా తీసుకొచ్చింది.
ఇక ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి చేస్తున్న సినిమా అనగనగా ఒక రాజు. కళ్యాణ్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అవ్వాలి కళ్యాణ్ శంకర్. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా లేట్ అవ్వడంతో, మాడ్ అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. జాతి రత్నాలు సినిమా మాదిరిగానే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది మ్యాడ్ సినిమాలో కూడా అక్కడక్కడ జాతి రత్నాలు సినిమాకి సంబంధించిన ఛాయలు కనిపిస్తాయి. దీనికి కారణం ఆ టీంలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ వర్క్ చేయడం. ఇక మ్యాడ్ సినిమాకి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ సినిమా కూడా వస్తుంది. ఈ సినిమా తర్వాత అనగనగా ఒక రాజు సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.
What do you guys think 😜 #AnaganagaOkaRaju https://t.co/a4MfHFNFip
— Naveen Polishetty (@NaveenPolishety) December 27, 2024
అనగనగా ఒక రాజు సినిమాకి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసినప్పుడే చాలామందికి అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది ఒక సందర్భంలో ఈ సినిమా ఆగిపోయింది అని వార్తలు కూడా వచ్చాయి. ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. టీజర్ ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. టీజర్ లో ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ సంబంధించిన ఫోటోషూట్ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అయితే మొదట ఫన్నీగా మాత్రమే అనిపించిన ఈ వీడియోలో మరో సీక్రెట్ కూడా ఉంది. ఫోటో గ్రాఫర్ ప్రతి ఫోజ్ ని తనదైన వాయిస్ లో చాలా ఫన్నీగా చెబుతున్నాడు. అయితే ఈ వాయిస్ ఎవరిదో అని చాలామంది పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రత్యేకించి మళ్లీ మళ్లీ చూడటం వలన ఆ వాయిస్ కూడా నవీన్ పోలిశెట్టిది అని అర్థమవుతుంది. ఇక తాజాగా ఒక నెటిజన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పోస్ట్ చేశాడు. దీనికి నవీన్ స్పందిస్తూ మీరేమంటారు గాయ్స్ అంటూ రిప్లై ఇచ్చాడు.
Also Read : Daaku Maharaj: ఇంటర్వెల్ లోనే థియేటర్స్ తగలపడిపోతాయి