Sithara entertainment: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో బడా నిర్మాణ సంస్థలు.. మరెన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ మంచి విజయాలను తమ ఖాతాలో వేసుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు మంచి మంచి కథలను పట్టేస్తూ.. ఆ కథలను ప్రేక్షకులకు చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఓకే ఏడాది ఒక నిర్మాణ సంస్థ నుండి రెండు లేదా మూడు చిత్రాలు విడుదల అయితే.. ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ మాత్రం ఏకంగా పదుల సంఖ్యలో చిత్రాలను లైన్ లో పెట్టింది. అదేదో కాదు హారిక హాసిని అండ్ సితార గ్రూప్.. ఈ నిర్మాణ సంస్థ లైనప్ చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మరి సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాబోయే చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
డాకు మహారాజ్..
ప్రముఖ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో.. బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ఇది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.
మ్యాజిక్..
ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా విడుదల కాలేదు. ఇక త్వరలోనే విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లు సమాచారం.
మ్యాడ్ స్క్వేర్..
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా ఎప్పటికప్పుడు పలు కారణాలవల్ల వాయిదా పడుతూనే వస్తోంది.
అనగనగా ఒక రాజు..
‘మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా తర్వాత ఆక్సిడెంట్ కి గురైన ప్రముఖ హీరో కం కమెడియన్ నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే టీజర్ విడుదల అవ్వగా.. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ వీడియో అంటూ ఒక వీడియో అందరినీ ఆకట్టుకుంది. ఇందులో నవీన్ పోలిశెట్టి మరొకసారి తన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.
మాస్ జాతర..
రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం మాస్ జాతర. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంతో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు రవితేజ.
తమరా.. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.
ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ కూడా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం.
ఇక మరోవైపు ఈ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి రాబోతున్న చిత్రాల విషయానికి వస్తే..
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా, ఎన్టీఆర్ – నెల్సన్ కాంబినేషన్లో సినిమా, విజయ్ – గౌతమ్ కాంబినేషన్లో ఒక సినిమా, ఆనంద్ దేవరకొండ – 90 బయోపిక్ ఆదిత్య హాసన్స్ కాంబినేషన్లో ఒక సినిమా, సూర్య మరియు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోయే చిత్రాలతో పాటు మోక్షజ్ఞ – వెంకీ అట్లూరి సినిమా అలాగే సూపర్ హీరో ఫిలిం కళ్యాణ్ శంకర్ మ్యాడ్ , మ్యాడ్ స్క్వేర్ తో పాటు కోహినూర్ సినిమాలు అలాగే అల్లరి నరేష్, సిద్దు జొన్నలగడ్డ, అశోక్ గల్ల వంటి హీరోలతో కూడా సినిమాలు చేయబోతున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాల లైనప్ చూస్తూ ఉంటే.. మరో రెండు మూడు సంవత్సరాలు సితార ఎంటర్టైన్మెంట్ వరస సినిమాలతో బిజీగా మారిందని చెప్పవచ్చు.