Department of Telecommunications : భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (DoT) టెలికాం యూజర్స్ కు హెచ్చరికలు జారీ చేసింది. భారత ప్రభుత్వం నుండి వస్తున్నట్లు తెలిపే అంతర్జాతీయ నెంబర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రభుత్వ అధికారుల పేరుతో మొబైల్ వినియోగదారులకి ఎన్నో కాల్స్ వస్తున్నాయని.. వీటితో మోసాలు జరుగుతున్నాయని.. ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అంతర్జాతీయ నంబర్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయొద్దని చెప్పుకొచ్చింది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ తెలిపిన సమాచారం ప్రకారం.. దేశంలో ఎన్నో సైబర్ నేరాలు జరుగుతున్నాయని.. ముఖ్యంగా సైబర్ క్రిమినల్స్ టెలిఫోన్ వినియోగదారుల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. మొబైల్ వినియోగదారులకు అంతర్జాతీయ నంబర్‌ల నుండి కాల్స్ వస్తున్నాయని.. అవి +91తో ప్రారంభం కావు. కానీ +8, +85, +65 వంటి నంబర్‌లతో మెుదలవుతాయి. అయితే ఇవి ఇండియాకు సంబంధించిన నెంబర్లు కాదని.. కానీ భారతీయ సేవలకు చెందిన అధికారులమని, ట్రాయ్, పోలీస్, ఆదాయపన్ను, సిబీఐ అధికారులని చెబుతూ ఫోన్స్ చేస్తారని తెలిపింది.
ఇక ఇలా కాల్ చేసిన మోసగాళ్లు మొబైల్ వినియోగదారుల నుంచి వారి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారని.. మొబైల్ నెంబర్లను డిస్కనెక్ట్ చేస్తూ డిజిటల్ అరెస్ట్, కొరియర్ లో డ్రగ్స్ లేదా మాదక ద్రవ్యాలు వచ్చాయని చెబితూ బెదిరిస్తారని తెలిపింది. ఈ కాల్స్ ను బాధితులు నమ్మితే వెంటనే వారికి వేరొకరు కాల్ చేస్తూ అధికారులమని నమ్మిస్తూ.. ఆ పై వారిని ట్రాప్ చేస్తూ డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తారని డీఓటీ తెలిపింది.
ఈ నేరాల పట్ల యూజర్స్ కు అవగాహన కల్పిస్తూ ఇప్పటికే టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని వెల్లడించింది DoT. అయితే టాస్క్ ఫోర్స్ తెలిపిన సమాచారం ప్రకారం, దేశం వెలుపల నుండి ఏదైనా కాల్ వచ్చినప్పుడు థ్రెఫ్ట్ సేవింగ్ ప్లాన్ సబ్‌స్క్రైబర్‌లకు “అంతర్జాతీయ కాల్” అని తెలుపుతూ ప్రదర్శించాలని కోరింది. దీంతో ఫోన్ చేసిన వాళ్లు భారతీయ అధికారులు లేదా సంస్థలు కాదని గుర్తిస్తుందని DoT తెలిపింది.
అయితే దేశం వెలుపలి నుండి వచ్చే కాల్‌ల కోసం ఎయిర్‌టెల్ ఇప్పటికే ‘ఇంటర్నేషనల్ కాల్’ని ప్రదర్శించింది. ఫోన్ కాల్.. స్కామ్ కాల్ అని గుర్తించడంలో ఇది చందాదారులకు సహాయపడుతుందని తెలుస్తుంది. దీనితో పాటుగా, టెలికాం డిపార్ట్‌మెంట్ ఈ ఏడాది అక్టోబర్‌లో ‘ఇంటర్నేషనల్ ఇన్‌కమింగ్ స్పూఫ్డ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్’ను కూడా ప్రారంభించింది. ఇది భారత్ నుంచే కాల్ చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ విదేశాల నుండి సైబర్ నేరస్థులు చేసే కాల్‌లను గుర్తించడానికి సహాయపడుతుంది.
ఇక DoT పంచుకున్న డేటా ప్రకారం.. ఈ సిస్టమ్ కేవలం 24 గంటల్లో టెంపర్డ్ ఇండియన్ ఫోన్ నంబర్‌లతో 1.35 కోట్ల ఇన్‌కమింగ్ ఇంటర్నేషనల్ కాల్స్ ను గుర్తించింది. దీంతో ఇటీవల కాలంలో భారతీయ నంబర్‌లతో గుర్తించబడిన, బ్లాక్ చేయబడిన స్పూఫ్ కాల్‌లు దాదాపు 6 లక్షలకు పడిపోయాయని ఆ సంస్థ తెలిపింది. ఇటువంటి మోసపూరిత కాల్‌ల గురించి అప్రమత్తంగా ఉండాలని, వాటిని ప్రభుత్వ సంచార్ సాథీ పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలని ఆ సంస్థ వివరించింది.
ALSO READ : యాపిల్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్.. లాంఛ్ ఎప్పుడండే!