Nayanatara: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush ) పై.. లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanatara)ఆరోపణలు చేస్తూ.. సుదీర్ఘ పోస్ట్ విడుదల చేసింది. ధనుష్ తనకు రూ.10 కోట్లకు లీగల్ నోటీసులు పంపడంపై మండిపడింది. “మీరు.. మీ తండ్రి, సోదరుడి సహాయంతో హీరో అయ్యారు. నేను నా రెక్కల కష్టంతోనే పైకి వచ్చాను. నా జీవితంపై నెట్ ఫ్లిక్ డాక్యుమెంటరీ తీస్తోంది. అందులో మీరు నిర్మించిన ‘నానుమ్ రౌడీ దాన్’ క్లిప్స్ వాడుకునేందుకు ఎన్ఓసి అడిగితే గత రెండు సంవత్సరాల నుంచి తిప్పించుకుంటున్నారు. 3 సెకండ్లకు రూ.10 కోట్లు కట్టాలా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నయనతార హీరో ధనుష్ పై మండిపడుతూ సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.
నయనతార కు ధనుష్ లీగల్ నోటీసులు..
తాజాగా నయనతార బయోపిక్ ఆధారంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix )డాక్యుమెంటరీ ఫిలిం (Documentary film) రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదలవగా.. ఇది చూసిన ధనుష్.. నయనతారకు లీగల్ నోటీసులు పంపారు. 2015లో ధనుష్ నిర్మాతగా, నయనతార హీరోయిన్గా నటించిన చిత్రం ‘నానుమ్ రౌడీ ధాన్’. అయితే ఈ సినిమాలోని సన్నివేశాలను తమ అనుమతి లేకుండా నయనతార డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు ధనుష్ రూ.10 కోట్లు నష్టపరిహారంగా కట్టాలి అంటూ నయనతారకు లీగల్ నోటీసులు పంపారు.
ధనుష్ పై మండిపడుతూ మూడు పేజీల లేఖ వదిలిన నయనతార
ఈ మేరకు మండిపడిన నయనతార మూడు పేజీలు కలిగిన సుదీర్ఘ పోస్ట్ ఒకటి పంచుకుంది. ధనుష్ ను నేరుగా ఉద్దేశించి నయనతార తన డాక్యుమెంటరీలో నిర్దిష్ట విజువల్స్ ను వాడుకోవడాన్ని సమర్థిస్తూ.. ఈ విధంగా పంచుకుంది. “2015 లో వచ్చిన చిత్రం నానుమ్ రౌడీధాన్ లోని పాటల వినియోగానికి సంబంధించి..ఎన్ఓసి (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) ను ఆమోదించడానికి రెండేళ్లు తిప్పించుకున్నారు. మిస్టర్ ధనుష్.. మీరు మీ తండ్రి కస్తూరి రాజా, సోదరుడు సెల్వ రాఘవన్ సహాయంతోనే ఇండస్ట్రీలోకి ఎదిగారు. కానీ నేను కష్టపడి పైకి ఎదిగాను ఇప్పుడు నాపై డాక్యుమెంటరీ తీయడానికి నెట్ఫ్లిక్స్ ముందుకు వచ్చింది. ఇక నా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విడుదల కోసం నాతోపాటు నా అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఇక మాకు ఎదురైన ఇబ్బందులను అధిగమించడానికి సినీ స్నేహితుల బృందం మొత్తం ఈ ప్రాజెక్టు తీయడానికి సహాయపడుతోంది. కానీ మీరు మాత్రం వ్యతిరేకంగా నాపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ డాక్యుమెంటరీలో నేను, నా జీవితం, నా ప్రేమ, పెళ్లి అలాగే ఇండస్ట్రీలో నేను ఎదిగిన తీరు, బహుళ చిత్రాలు నుండి జ్ఞాపకాలు ఎన్నో కూడా పొందుపరిచాను. నేను నటించిన ప్రతి సినిమా నిర్మాత, దర్శకుడు కూడా నాకు సహాయపడ్డారు. కానీ మీరు మాత్రం ఇలా చేయడం సమంజసంగా లేదు. నా ఈ చిత్రం చాలా ముఖ్యం. అందుకే మీరు నిరాకరించినా సరే.. నేను వదులుకోవాలనుకోలేదు. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రమే నేను నా డాక్యుమెంటరీలో పొందుపరిచాను. మీరు ఈ సినిమా నుండి క్లిప్పులు ఇవ్వడానికి నిరాకరించడంతో నా గుండె కాస్త పగిలిపోయింది.నిజానికి మీరు ఇవ్వకపోయినా అంత బాధ కలిగేది కాదు కానీ మీరు తీసుకున్న నిర్ణయం మాపై మీ వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్లగక్కినట్టు అనిపించింది. ఉద్దేశపూర్వకంగానే మీరు నాపై పగా ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు అంటూ ఒక సుదీర్ఘ పోస్ట్ వదిలింది నయనతార.