Chhattisgarh Encounter: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. కనీసం రెండు వారాలకు ఒక ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ముఖ్యంగా కీలక నేతలు మృతి చెందుతున్నారు.
లేటెస్ట్‌గా శనివారం ఉదయం 8 గంటలకు బస్తర్ రీజన్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది ఈ ఘటనలో నలుగురు మావోలు మృతి చెందారు. కాంకేర్ జిల్లా-నారాయణపూర్ జిల్లాల మధ్యనున్న ఉత్తర అంబుజ్‌మద్ ప్రాంతంలో మావోలు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్-స్పెషల్ టాస్క్ ఫోర్సు బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. దీంతో మావోయిస్టులకు- భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ జాయింట్ ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులు చనిపోయినట్టు వెల్లడించారు అధికారులు. ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని గాలింపు మొదలుపెట్టారు.
చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజన్ మావోయిస్టులకు కంచుకోటగా చెబుతారు. ఆ ప్రాంతంలోకి ఎవరెళ్లినా తిరిగి రావడం కష్టమని చెబుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ప్రాంతంలో అడుగు పెట్టాలంటే బలగాలు హడలిపోవాల్సిందే. ఇదంతా 20 ఏళ్ల కిందట మాట.