Nayani Pavani..నయని పావని(Nayani Pavani).. బిగ్ బాస్ చూసేవారికి ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఈమె రెడీ అయ్యే తీరు, ధరించే దుస్తులు మొదలుకొని చాలా అందంగా ముస్తాబయ్యేది. అయితే ఆ మేకప్ కాస్త కరిగిపోయే వరకు కన్నీళ్లు పెట్టుకునేది. అలా ఎప్పుడూ ఏడుపు మొహంతో అందరిలో కాస్త చిరాకు తెప్పించిన నయనీ పావని క్రై బేబీ అని ముద్ర కూడా వేయించుకొని, ఫుల్ నెగెటివిటీతో బయటకు వచ్చింది. వాస్తవానికి రెండుసార్లు ఈమెకు హౌస్ లోకి వెళ్లి అవకాశం వచ్చి.. హౌస్ లోకి వెళ్ళినా సరే తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోయింది.ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో హౌస్ లో శివాజీ (Sivaji) ని నాన్న అని పిలుచుకుంటూ ఓరకంగా పాపులారిటీ అయిన ఈమె.. ఇప్పుడు బికినీ ధరించి బీచ్ లో వయ్యారాలు పోతూ నెటిజన్స్ ను ఆశ్చర్యానికి గురిచేసింది.
బీచ్ లో బికినీతో రచ్చ చేసిన నయని పావని..
సాధారణంగా నయనీ పావని అంటేనే మనకు చీరకట్టు లేదా మోడ్రన్ డ్రెస్సులు మాత్రమే గుర్తుకొస్తాయి. చిట్టి పొట్టి బట్టల్లో కూడా ఈ పొట్టి పిల్ల చాలా అందంగానే కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ రేంజ్ లో నయని పావనిని జనాలు కూడా చూడలేదని చెప్పాలి. తాజాగా బికినీ వేసుకొని బీచ్ లో సందడి చేస్తున్న వీడియోని షేర్ చేయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి తోడు ఈ వీడియో కంటే కూడా ఈ వీడియో కింద పెట్టిన కామెంట్లు మరింత ట్రెండ్ అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత సేపూ.. శివాజీని నాన్న అని పిలిచింది కాబట్టి కొంతమంది అయితే ఏకంగా మంగపతి (శివాజి ) చూస్తున్నాడు. ఇంటికి రా నువ్వు అయిపోయావు అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతుంటే.. మరి కొంతమంది బికినీలో అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొక వైపు ఆమె అభిమానులు మాత్రం హర్ట్ అవుతున్నారని చెప్పవచ్చు.మోడ్రన్ గా కనిపించినా.. ఎప్పుడు సంప్రదాయంగా కనిపించే నువ్వు ఇలా బికినీ వేసుకొని అందరిలో రచ్చ చేయడం ఏమాత్రం నచ్చలేదు.. నీపై ఉన్న ఇష్టం ఈరోజుతో చచ్చిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఈమె వేసుకున్న బికినీ అభిమానులకు పూర్తిస్థాయిలో ఆగ్రహాన్ని తెప్పిస్తోందని చెప్పవచ్చు.
నయనీ పావని కెరియర్..
ఇక నయని పావని విషయానికి వస్తే.. ఈమె అందాల విందుకు, సొగసుల ప్రదర్శనకు కుర్రకారు ఫిదా అవుతారు. కానీ ఆమె అభిమానులు మాత్రం ఎప్పుడూ హర్ట్ అవుతారని చెప్పాలి. ఇకపోతే ఈమె కెరియర్ విషయానికి వస్తే.. హీరోయిన్గా వెండితెరపైకి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే బుల్లితెరపై అడపాదడపా ప్రోగ్రాం లో కూడా కనిపిస్తోంది. ఇక బిగ్ బాస్ ఇంట్లోకి రెండుసార్లు వెళ్లి వచ్చినా సరే.. ఫేమ్ మాత్రం రాలేదు. మరి ఇప్పటికైనా ఈమె అందాలు చూసి ఈమెకు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.
?utm_source=ig_web_copy_link