IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ రెండో వారంలో అడుగుపెట్టింది. తొలి మ్యాచ్ లో గెలిచిన జట్లు రెండవ మ్యాచ్ లో ఓడిపోతుండగా.. తొలి మ్యాచ్ లో ఓడిన జట్లు రెండవ మ్యాచ్ లో విజయం సాధిస్తున్నాయి. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {Royal Challengers Bangalore} జట్టు మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం ఆడిన రెండు మ్యాచ్లలోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి ప్లేస్ లో చేరింది.
Also Read: SRH: SRH కు ఆంధ్రప్రదేశ్ బంపర్ ఆఫర్.. షాక్ లో హైదరాబాద్ ?
ఈ ఐపీఎల్ సీజన్ లో అన్ని జట్లలో మార్పులు జరగడంతో మ్యాచ్ లు కూడా చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇక ఆర్సిబి ఈ సీజన్ లో అదరగొడుతోంది. ఈ సీజన్ లో యంగ్ ప్లేయర్ రజత్ పటిదార్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన ఆర్సిబి.. తొలి మ్యాచ్ లో ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్ జట్టును ఓడించగా.. శుక్రవారం రోజు చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ పై 50 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది.
2008 తర్వాత చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించి సత్తా చాటింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలోనూ హోం టీమ్ లను చిత్తు చేసి {Royal Challengers Bangalore} పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకు వచ్చింది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు చేతిలో ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగవ స్థానం నుండి 8వ స్థానానికి పడిపోయింది. కాగా లక్నో సూపర్ జెయింట్స్.. సన్రైజర్స్ హైదరాబాద్ నీ ఓడించి తొలి విజయంతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది.
ఈ సీజన్ లో 8 మ్యాచ్ ల తర్వాత ఆర్సిబి పరిస్థితి చాలా మెరుగ్గా కనిపిస్తుంది. మరోవైపు ఈ సీజన్ లో మూడు జట్లు ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ని వారి సొంత మైదానంలో ఓడించింది చెన్నై సూపర్ కింగ్స్. ఇక రెండవ జట్టు గుజరాత్ టైటాన్స్ కి గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. మొదటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది.
Also Read: SRH: హైదరాబాద్ వదిలి వెళ్లిపోతాం.. SRH ఆందోళన !
ఆ తర్వాత శనివారం రోజు ముంబై తో జరిగిన మ్యాచ్ లో గెలుపొందింది. కాగా రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్ లో హైదరాబాద్ చేతిలో ఓడిపోగా.. రెండవ మ్యాచ్ లో కలకత్తా చేతిలో ఓడిపోయింది. ఐతే నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు ఉండడంతో పాయింట్ల పట్టికలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ – ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తెలపడనున్నాయి. అలాగే రాత్రి 7:30 గంటలకు రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీ పడనున్నాయి.