
Nayanthara latest news(Celebrity news today):
నయనతార.. సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన అద్భుతమైన నటి. 2003 మనసునక్కరే అనే మలయాళం మూవీ తో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి 20 సంవత్సరాలు గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్. కామెడీ అయినా.. సీరియస్ రోల్ అయినా.. చిలిపితనమైనా.. నయనతార అద్భుతంగా నటిస్తుంది. అందుకే ఆమెను అభిమానులు ముద్దుగా లేడీస్ సూపర్ స్టార్ అని అంటారు. కేవలం సినిమాలలోనే కాకుండా ప్రొడక్షన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో కూడా నయనతార తన ప్రతిభ చూపిస్తూ ముందుకు దూసుకుపోతోంది.
ఈ రోజు నవంబర్ 18న 39వ పుట్టినరోజు నయనతార జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె నటించిన ఎన్నో మూవీస్ ఓటీటీ లో ప్రసారమవుతున్నాయి. అన్నం ఉడికిందా లేదా చెప్పడానికి ఒక మెతుకు పట్టుకుని చూస్తే ఎలా సరిపోతుందో నయనతార లోని నటన ఎలాంటిదో చెప్పడానికి ఆమె మూవీస్ లో కొన్ని చూస్తే అర్థమయిపోతుంది. అలా యూనిక్ పర్ఫామెన్స్ తో నయనతార తప్ప ఇంకెవరు ఆ రోల్ చేయలేరు అనిపించే విధంగా నయనతార నటించిన కొన్ని చిత్రాలపై ఓ లుక్కేద్దాం.
వాసుకి
2016లో తెరకెక్కిన ఈ రివెంజ్ డ్రామాను మలయాళంలో పుతియ నియమం పేరుతో విడుదల చేశారు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో.. తన అపార్ట్మెంట్ లోనే తనపై అత్యాచారం జరగడంతో ఆమె తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్తుంది. అజ్ఞాతంగా తన భర్త పోలీస్ ఆఫీసర్ రూపంలో చనిపోవాలి అనుకున్న ఆమెకు అత్యాచారం చేసిన వ్యక్తులను అంతమొందించడంలో సహాయం చేస్తాడు. ఈ మూవీలో నయనతార నటించిన విధానం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ మలయాళం సూపర్ హిట్ మూవీలో నయనతార తో పాటు మమ్ముట్టి,షీలు అబ్రహం ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా జీ 5 లో స్ట్రీమింగ్ అవుతోంది.
కో కో కోకిల
విమర్శకుల చేత కూడా ప్రశంసలు పొందే నటన నయనతార.. కొలమావు కోకిల మూవీలో కనబరిచింది. అనారోగ్యంతో ఉన్న తల్లిని కాపాడుకోవడానికి ఒక అమ్మాయి డ్రగ్ మాఫియాలోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి ఆమె క్రమంగా ఎదగడంతో పాటు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటుంది. ఈ కామెడీ థ్రిల్లర్ ఎప్పుడు చూసినా మంచి రిలాక్సింగా ఉంటుంది. ఈ మూవీ కూడా జీ 5 లో స్ట్రీమింగ్ అవుతోంది.
శ్రీరామరాజ్యం
రామాయణం ఆధారంగా తీసిన ఈ సినిమాలో.. సీత పాత్రలో నయనతార అద్భుతంగా నటించింది. బాలకృష్ణ ఇందులో రాముడు పాత్ర పోషించారు. సీతను అడవికి తరలించిన తర్వాత.. లవకుశల జననం దగ్గర నుంచి తిరిగి రాముడు సీతను కలవడం.. చివరికి సీతమ్మ ఆమె తల్లి భూమాతలో కలిసిపోవడం వరకు అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో నయనతార తన పాత్రకే ప్రాణం పోసినట్లు నటించింది. ఈ మూవీ జియో సినిమా లో స్ట్రీమింగ్ అవుతోంది.
మాయ
2015 లో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో ఒక అప్ కమింగ్ యాక్టర్ గా.. సింగిల్ మదర్ గా.. నయనతార నటన అద్భుతం. ఇందులో నయనతార చనిపోయి దెయ్యంగా మారినా ఆమె తల్లి పాత్రలో కూడా అద్భుతంగా నటించింది. ఈ మూవీ జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది.
కర్తవ్యం
2017లో విడుదలైన తమిళ్ మూవీ అరమ్‌లో నయనతార ఒక జిల్లా కలెక్టర్ క్యారెక్టర్ లో నటించారు. ఒక పసిబిడ్డ బోరు బావిలో పడి ఇరుక్కున్న ఒక చిన్న బిడ్డని రక్షించడానికి కలెక్టర్గా ఆమె పడే తాపత్రయం అద్భుతంగా ఉంటుంది. రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటూ .. వ్యవస్థలో ఉన్న లొసుగులను బహిర్గతం చేస్తూ.. ప్రజల కోసం అండగా నిలబడే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నయనతార అద్భుతమైన నటనా పటిమను కనపరిచింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
Revanth Reddy: 100 కోట్ల భూమి.. 21 అంతస్తుల బిల్డింగ్.. కేసీఆర్‌పై రేవంత్ ఆగ్రహం..