
Vijayashanti joins Congress(Telangana Congress News):
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేసింది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార, ప్లానింగ్ కమిటీపై పార్టీ హైకమాండ్ ప్రకటన చేసింది. కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా విజయశాంతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ కన్వీనర్లుగా 15 మందికి అవకాశం కల్పించింది. మల్లురవి, కోదండ రెడ్డి, వేం నరేదంర్, సమరసింహారెడ్డి, పుష్పలీల, అనిల్, రాములు నాయక్ , పిట్ల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్, రమేష్ ముదిరాజ్, పారిజాత రెడ్డి, సిద్దేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలిబిన్ ఇబ్రహీం మస్కతి, దీపక్ జాన్ లను కన్వీనర్లుగా నియమిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించింది.
కాగా.. బీజేపీలో విజయశాంతికి ఏ స్థానమైతే దక్కలేదో.. ఇక్కడ కాంగ్రెస్ దానికే ఇంపార్టెన్స్ ఇచ్చింది. బీజేపీలో తనకు సముచితమైన స్థానం లేదని రాములమ్మ తెలిపిన విషయం తెలిసిందే. శుక్రవారమే ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతిని.. వెంటనే పార్టీ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్ గా నియమించింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలో లీడర్లు ఆ పార్టీలను వీడి కాంగ్రెస్ కండువాలను కప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ఆరు ప్రధాన అంశాలతో పాటు.. శుక్రవారం విడుదల చేసిన పూర్తిస్థాయి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తోంది.
.
.