Viral video: ఇటీవలి కాలంలో గుండెపోటు వచ్చి చనిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అప్పటి వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపినవారు సైతం ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు. కొంతమంది డ్యాన్స్ చేస్తూ పడిపోతే.. మరికొందరు నడుస్తూ ఒక్కసారిగా పడిపోతున్నారు. అంతే కాకుండా వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు రావడం ఆందోళన కలిగిస్తోంది. రీసెంట్ హైదరాబాద్ లో యువకుడు ఆలయం చుట్టూ ప్రదిక్షణలు చేస్తూ గుండెపోటుతో కన్నుమూశాడు.
Also read: పోసాని సంచలన ప్రకటన.. రాజకీయాలకు గుడ్ బై.. చచ్చేవరకు ఎవ్వరి గురించి మాట్లాడను
ఓ చిన్నారి పరిగెత్తుతూ గుండె పోటుతో కన్నుమూసింది. ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకు రెండు మూడు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి మన జీవనశైలి కారణం కొంతమంది వైద్యులు చెబుతుంటే, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరవాతనే గుండెపోటు మరణాలు పెరిగాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రతిరోజూ తీసుకునే జంక్ ఫుడ్, కల్తీ ఆహారమే గుండె పోటు మరణాలకు కారణం అని కూడా వైద్యులు చెబుతున్నారు. ఇక తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కిందపడిపోయాడు.
చూడటానికి ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్న వ్యక్తి స్నేహితులతో కలిసి స్టేజిపైకి ఎక్కాడు. వివరాల్లోకి వెళితే… ఈ ఘటన కర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో చోటు చేసుకుంది. వంశీ అనే యువకుడు తన స్నేహితుడి పెళ్లిలో స్టేజిపై ఉండగా గుండెపోటుతో కిందపడిపోయాడు. అతడిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కానీ అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు నిర్దారించారు. మృతుడు వంశీ బెంగళూరు అమెజాన్ కంపెనీలో పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్టేజిపై ఉన్న దంపతులతో సహా పెళ్లికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు. పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకోవడంతో అక్కడున్నవారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
స్నేహితుడి వివాహా వేడుకలో గుండెపోటుతో యువకుడి మృతి
కర్నూల్ జిల్లా పెనుమడలో వరుడికి గిఫ్ట్ ఇస్తూ స్టేజ్ పైనే గుండెపోటుకు గురైన వంశీ అనే యువకుడు
డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్నేహితులు.. అప్పటికే మృతిచెందినట్లు నిర్థారించిన డాక్టర్లు
ప్రస్తుతం బెంగుళూరులోని అమెజాన్… pic.twitter.com/05ChL5jvfO
— BIG TV Breaking News (@bigtvtelugu) November 21, 2024