Manchu Family: నటుడు మోహన్ బాబు కుటుంబంలో గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యక్తిగత వివాదాలుగా మొదలైన ఈ గొడవలు అన్నదమ్ముల మధ్య పెద్ద వైరాన్ని పెంచాయి. ఆ గొడవలు కాస్త రచ్చకేగి, ఆస్తుల కోసం అన్నదమ్ముల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఆస్తి పంపకాల విషయంలో విష్ణు, మనోజ్ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడం అందరికీ తెలిసిందే.. తాజాగా మనోజ్ తనకి కోర్టు నోటీసులు ఇచ్చిందని తన ఇంటికి తను వెళ్లవచ్చు అని మోహన్ బాబు ఇంటి దగ్గరికి వెళ్లి చేసిన రచ్చ, అంతా ఇంతా కాదు. ఇంత జరిగినా మోహన్ బాబు బహిరంగంగా వచ్చి, మనోజ్ తో మాట్లాడింది లేదు. మనోజ్ చేస్తున్న వాదనలో ఎంతో కొంత నిజమైతే ఉంది. మనోజ్ ని ఇంటి నుంచి బయటకు పంపించడం. ఆయన వస్తువులు ధ్వంసం చేయడం, మనోజ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం.. అన్ని మనకి బహిర్గతం అవుతున్న విషయాలు. అసలు ఆ ఇంట గొడవలు జరగడానికి కారణం ఏంటి.. ఆస్తి తగాదాలేనా ఇంకేమైనా ఉన్నాయా అని అందరి మదిలో వచ్చే ప్రశ్న. ఈ విషయంలో ఓ ఆసక్తికరమైన కారణం బయటికి వచ్చింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
‘క్యాస్ట్ ఫీలింగ్’ నిజంగా కారణం అదేనా..
మంచు ఫ్యామిలీలో జరిగే గొడవలకి, వారింట్లో జరిగిన పెళ్లిళ్లకు సంబంధం ఉందా అంటే ఉందనే అంటున్నారు. మోహన్ బాబుకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. లక్ష్మీ ఒక తమిళియన్ ని చేసుకుంది. విష్ణు చేసుకుంది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి కావడంతో విష్ణు చేసుకునే అమ్మాయిని మోహన్ బాబు యాక్సెప్ట్ చేశాడు. కానీ మనోజ్ చేసుకునే అమ్మాయి అఖిలప్రియ చెల్లెలు భూమా మోనికని చేయాలా అని సమాచారం. ఒక కొడుకు చేస్తే తప్పు కానప్పుడు.. రెండో కొడుకు చేస్తే తప్పేంటి? ఆ అమ్మాయికి రెండో పెళ్లి అయి, అప్పటికే బాబు ఉన్నాడు
అయినా మనోజ్ కి అది నచ్చే చేసుకున్నాడు. అలాంటప్పుడు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మోహన్ బాబుది. మ్యారేజ్ అయిన అమ్మాయిని చేసుకోకూడదు అని ఎక్కడా రూల్ లేదు కదా, వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు అర్థం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు చేసుకున్నారు. ఫస్ట్ నుంచి మనోజ్ కి మంచు లక్ష్మికి ఎక్కువ సపోర్ట్ గా ఉంటారు. మనోజ్, విష్ణు గొడవ పడినప్పుడు ఎక్కువగా లక్ష్మీనే సర్ది చెబుతూ ఉంటారన్నది వాస్తవం. మనోజ్ పెళ్లి దగ్గర నుండి లక్ష్మీ తన సోదరుడికి సపోర్ట్ గా నిలిచింది.
బాధ్యత అంతా ఆయనదే ..
సీనియర్ నటుడు మోహన్ బాబు తన నటనతో, ఎన్నో సినిమాలను చేసి కలెక్షన్ కింగ్ గా టాలీవుడ్ లో ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ నటనపై తనకున్న మక్కువని చాటుతున్నారు. సినిమా పరంగా పక్కన పెడితే కుటుంబ వ్యవహారాల్లో మోహన్ బాబు, విష్ణు కలిసి మనోజ్ ని ఇబ్బంది పెడుతున్నారన్నది మనోజ్ చేస్తున్న వాదన. ఈ గొడవకి పులిస్టాప్ పెట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా మోహన్ బాబు మీదే ఉంటుంది. గతంలో టాలీవుడ్ లో ఇలాంటి కుటుంబ తగాదాలు మనం ఇంత క్రితం చూసాము. కానీ ఇంటి పెద్ద ఈ గొడవలన్నీ బాధ్యతగా తీసుకొని సర్ది చెప్పి కుటుంబంలో వచ్చే తగాదాలు పబ్లిక్ అవ్వకుండా చూడాలి. కానీ మనోజ్ విషయంలో మోహన్ బాబు సైలెంట్ గా వుంటున్నారు. అందుకు కారణం మోహన్ బాబుకి ఇష్టం లేకుండా మనోజ్ మౌనికని పెళ్లి చేసుకోవడమేనా.. క్యాస్ట్ కారణంగా తనని చేసుకోవడం మోహన్ బాబుకి ఇష్టం లేదని అప్పట్లో టాక్. అప్పటి నుంచే వారి ఇంట్లో గొడవ జరుగుతుంది అని అంటున్నారు. వివాదం ముదిరి అన్నదమ్ముల మధ్య వైరం మరింత పెరిగే లోపు, మోహన్ బాబు కలగజేసుకొని ఈ గొడవని పరిష్కరించాలని, అన్నదమ్ములు కలిసి ఉండాలని కోరుతున్నారు మంచు ఫ్యాన్స్.
Also read:Mangalavaram 2 : హర్రర్ తో పాటు మరో ప్రయోగం… ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే