Nayanthara: సెలబ్రిటీలు నిత్యం వరుస సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా గడిపేస్తూ ఉంటారు. అయితే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తమ కుటుంబానికి సమయాన్ని కేటాయించాలని కోరుకుంటారు. అందుకే కాస్త షూటింగ్ నుండి విరామం దొరికిందంటే చాలు, ఫ్యామిలీని తీసుకొని విదేశాలకు వెకేషన్ కి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇకపోతే విదేశీ ప్రయాణం ఎక్కువగా చేసేవారిలో ప్రథమంగా వినిపించే పేరు మహేష్ బాబు (Maheshbabu). ఇక తర్వాత ఈ మధ్య నయనతార (Nayanthara) కూడా అలాగే మారిపోయిందనే చెప్పాలి. ఇద్దరు పిల్లలు తమ జీవితంలోకి వచ్చిన తర్వాత వారికంటూ ఒక సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె ‘మూకుత్తి అమ్మన్ 2’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుందర్ సి(Sundar .C) దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ‘మూకుత్తి అమ్మన్’ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా గతంలోనే తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా డబ్బింగ్ అయ్యి విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి కాస్త బ్రేక్ దొరకడంతో తన భర్త విఘ్నేష్ శివన్ (Vighnesh Shivan) తో పాటు పిల్లలతో కలిసి యూరప్ ట్రిప్ వెళ్ళింది నయనతార.
నయనతార ధరించిన స్లింగ్ బ్యాగ్ ధర ఎంతంటే.
అక్కడ ఈఫిల్ టవల్ దగ్గర తన భర్త, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక అలా యూరప్ ట్రిప్ నుండి నయనతార షేర్ చేసిన ఫోటోలలో ఆమె వాడిన స్లింగ్ బ్యాగ్ చాలా స్పెషల్ గా ఉంది. అది ప్రాడ బ్రాండ్ బ్యాగ్. ఈ బ్రాండ్ 1913 నుంచి ఫ్యాషన్ ప్రపంచంలో ఉంది. ఈ బ్రాండ్లో తక్కువ ధర బ్యాగు కూడా మినిమం లక్షల్లోనే ఉంటుంది. ఇక్కడ నయనతార వాడుతున్న ఈ బ్యాగ్ ధర అక్షరాల రూ.2లక్షలట. ఒక హ్యాండ్ బ్యాగ్ ధర రెండు లక్షలు అని తెలిసి అటు నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వివాదాల్లో నిలిచిన నయనతార..
తన సినిమాలు తాను చేసుకుంటూ పోయే నయనతార ఈమధ్య ఎక్కువగా తరచూ వివాదాలలో చిక్కుకుంటుందని చెప్పవచ్చు. పెళ్లయిన తర్వాత సరోగసి ద్వారా పిల్లల్ని కని వివాదాన్ని కొనతెచ్చుకున్న ఈమె.. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో తన పెళ్లి గురించి డాక్యుమెంటరీ విడుదలైనప్పుడు కూడా ధనుష్ తో కాపీరైట్ సమస్య ఎదుర్కొంది. ఆ తర్వాత ముగ్గురు జర్నలిస్టుల గురించి మాట్లాడి మరో వివాదంలో ఇరుక్కుంది. ఇలా తరచుగా వివాదాలలో నిలుస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న ఈమె.. అయినా సరే వాటన్నింటినీ లెక్క చేయకుండా ఇటు తరచూ కుటుంబంతో విదేశాలకు వెళ్తూ సంతోషంగా కెరియర్ ను కూడా లీడ్ చేస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే ..ఇటీవల ఈమె నటించిన ‘టెస్ట్’ సినిమా విడుదల అవ్వగా ..పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఇప్పుడు రాక్కాయి, టాక్సిక్ వంటి సినిమాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం ‘టాక్సిక్’ సినిమాలో యష్ (Yash) కి సోదరి పాత్రలో నటిస్తోంది నయనతార.