BigTV English

Poonch Tensions: భారత్-పాక్ సరిహద్దుల్లో టెన్షన్.. దినేష్ కుమార్ వీర మరణం

Poonch Tensions: భారత్-పాక్ సరిహద్దుల్లో టెన్షన్.. దినేష్ కుమార్ వీర మరణం

Poonch Tensions: భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో టెన్షన్ కంటిన్యూ అవుతుందా? సరిహద్దుల్లో మిస్సైల్స్‌ని మొహరించిన పాక్ నెక్ట్స్ అడుగు ఎటువైపు? భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతుందా? కావాలనే సరిహద్దుల్లోని గ్రామాలపై ఎక్కుపెట్టిందా? పూంచ్ సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం జరిపిన భారీ షెల్లింగ్‌లో భారత జవాను అమరుడయ్యాడు.


పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది భారత్. దాదాపు 80 మంది ఉగ్రవాదులు మరణించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. భారత్‌పై ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని ఆగ్రహంతో రగిలిపోతుంది దాయాది దేశం పాకిస్థాన్.

సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు


పహల్‌గామ్ ఉగ్ర దాడి తర్వాత సరిహద్దుల్లో సైన్యాన్ని మొహరించింది. ఆపై కాల్పు విరమణ ఒప్పందాన్ని తూట్లు పొడిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి-LOC పాకిస్తాన్ సైన్యం కాల్పులకు దిగింది. ఈ ఘటనలో 5 ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన లాన్స్ నాయక్ దినేష్‌కుమార్ శర్మ అమరుడయ్యాడు.

బుధవారం రాత్రి నుంచి కాల్పులకు దిగిన పాకిస్థాన్ సైన్యం, భారత ఫార్వర్డ్ పోస్టులను సమీపంలోని గ్రామాలను లక్ష్యంగా షెల్లింగులను ప్రయోగించింది. భారీ మోర్టార్లు ఆ గ్రామాల్లో పడ్డాయి. ఈ చర్యను కాల్పుల విరమణ ఉల్లంఘనగా, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యగా భావిస్తోంది సైన్యం. శత్రువులతో చివరివరకు పోరాడారు దినేష్‌ కుమార్ శర్మ. ఆయన వీర మరణాన్ని సైన్యం ధృవీకరించింది.

ALSO READ: పూర్తిగా అంతం చెయ్యిండి.. పహల్ గామ్ బాధితురాలు హిమాన్షి భావోద్వేగం

వీరుడి కుటుంబాలకు సంతాపం తెలిపింది. అమర వీరుడైన 32 ఏళ్ల జవాన్ దినేష్‌కుమార్ శర్మ హర్యానాలోని మొహమ్మద్‌పూర్ గ్రామానికి చెందినవాడు. పూంచ్ సెక్టార్‌లో ఎల్‌ఓసి వెంబడి సేవలందిస్తున్నాడు. దినేష్ అంకితభావం, ధైర్యం మరువలేనివని తెలిపారు ఆర్మీ అధికారులు.

ఎల్‌ఓసీ వెంబడి టెన్షన్

దినేష్ అమరవీరుడు అయ్యాడన్న వార్త తెలియగానే దేశవ్యాప్తంగా ప్రజలు నివాళులు అర్పించారు. హర్యానా ముఖ్యమంత్రి నయీబ్ సింగ్ సైని జవాన్ దినేష్ కుమార్ శర్మ ధైర్య సాహసాలను కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ గురువారం ఉదయం పూంచ్‌లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. పాల్వాల్‌కు చెందిన జవాన్ దినేష్ కుమార్ శర్మ మరణించాడు. దేశంలో ప్రతి పౌరుడు అమర వీరుడి పట్ల గర్వపడుతున్నారని రాసుకొచ్చారు. మీ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదని, ఈ ధైర్యసాహసాలకు వందనం చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

జమ్మూ కాశ్మీర్‌లో సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. గడిచిన రెండువారాల్లో పౌరులను పొట్టన పెట్టుకుంది. మరో 57 మంది సామాన్యులు గాయపడ్డారు. పాకిస్తాన్ సైన్యం కాల్పులకు ఆర్మీ ధీటుగా బదులు ఇస్తోంది. ఈ క్రమంలో పలువుకె పాకిస్తాన్ సైనికులు మరణించినట్టు వార్తలు వస్తున్నాయి.

Related News

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Indian Army Upgrades: పాక్‌కు ముచ్చెమటలు పట్టించే నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఏకంగా రూ.67 వేల కోట్లతో…

Uttarkashi Cloudburst: ఉత్తరకాశీ విషాదం.. 28 మంది కేరళా టూరిస్టులు గల్లంతు.. పెరుగుతోన్న మరణాల సంఖ్య

MLAs Free iPhones: ఎమ్మెల్యేలకు ఉచితంగా ఐఫోన్లు.. రాజకీయ రచ్చ, ఎక్కడంటే

Poonch sector firing: కాల్పులకు తెగబడ్డ పాక్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సైన్యం!

Dharali floods: 11 మంది జవాన్లు గల్లంతు.. మరో నలుగురు మృతి.. అక్కడ ఊరుఊరంతా..?

Big Stories

×